33.7 C
Hyderabad
April 29, 2024 02: 23 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఏపిలో ముస్లింలకు రంజాన్ వెసులుబాటు

cm jagan

ఒక వైపు కరోనా వ్యాప్తి ఆగకపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ముస్లింలకు రంజాన్ సందర్భంగా పలు పబ్లిక్ సౌకర్యాలు కల్పించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఒక ప్రకటన జారీ చేసింది. పవిత్ర రంజాన్ నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించిన అంశాలు:

1. 24×7 విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా ఉంటుంది. 2. ఎటువంటి త్రాగునీటి సమస్య లేకుండా ప్రభుత్వం చూస్తుంది. 3. కూరగాయలు, పండ్ల ఫలాలు, మిగతా అన్ని నిత్యవసర సరుకులు ఉదయం 10 గంటల వరకు  అందుబాటులో ఉంటాయి.

4. సాయంత్రం ఇఫ్తార్ సమయానికి పండ్ల ఫలాలు,డ్రై ఫ్రూట్స్ అమ్ముటకు అనుమతి ఇచ్చి ముస్లిం సోదర సోదరీమణులకు అందుబాటులో ఉండేలా చేస్తుంది. 5. సామాజిక దూరం పాటిస్తూ ఉదయం 3 – 4.30 వరకు సాయంత్రం 5.30 – 6.30 వరకు దాతలు ఎవరైనా పేదలకు దానం చేయుటకు బయటకు రావడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

6. మీ నగరాలలో కొన్ని హోటల్స్ ను గుర్తించి సహరి ఇఫ్తార్ సమయాలలో మాత్రమే భోజనం, ఇతర తినబండారాలు అందుబాటులో ఉండే విధంగా చూస్తుంది. 7. క్వారన్ టైన్ లో ఉన్న ముస్లిం లకు సహరి, ఇఫ్తార్ సమయంలో వ్యాధి నిరోధక శక్తి, సామర్ధ్యాన్ని  పెంచే ఆహారాన్ని ప్రభుత్వమే అందిస్తుంది. 8. ఇమామ్, మౌజన్ లకు 5 పూటలా నమాజులు చదివించి మస్జీద్ నుండి ఇంటికి, ఇంటి నుండి మస్జీద్ కి వెళ్లే వెసులుబాటు కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Related posts

కడప ఎంపీ తో ఎస్.ఎస్.ఏ, పి.టి.ఐ.లు భేటి

Satyam NEWS

పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు వైసీపీ నేతల అభినందనలు

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: పాకిస్తాన్ రాజధానిలో మళ్లీ లాక్ డౌన్ విధింపు

Satyam NEWS

Leave a Comment