మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నీ చోట్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యుడు మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి అన్నారు.
నందలూరు మండలంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 50 ఏళ్ల చరిత్రలో ఎన్నికల్లో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా, ఎవరూ చూడని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పిటిసీ ఎన్నికలో జగన్మోహన్ రెడ్డి పాలనకు, పథకాలకు ప్రజలు పట్టం కట్టారని అన్నారు.
రాష్ట్రంలో ఎంపిటిసిలు,జడ్పిటిసీ ఎన్నికల్లో ప్రజలు ఏకగ్రీవాలు కట్టపెడుతున్నారన్నారు. కడప జిల్లాలో 100 శాతం స్వీప్ చేస్తున్నామని, రాష్ట్ర మంతా ఇదే పరిస్థితి నెలకొంది అని అన్నారు. దివంగత నేత వైస్సార్ ఆశయ సాధనను తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరింత ముందుకు తీసుకుని పోతాడని ఆయన అన్నారు.