38.2 C
Hyderabad
April 29, 2024 19: 43 PM
Slider విజయనగరం

దిశ జాగృతి యాత్ర: ప్ర‌లోభాల‌కు..వ్యామోహాల‌కు ప‌డి పోకండి…!

#dishaapp

ఈ నెల విజ‌య‌న‌గ‌రం   జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ప్రారంభ‌మైన దిశ జాగృతి యాత్ర‌.. మూడు పోలీస్ స‌బ్ డివిజ‌న్ల‌ను తిరిగుతోంది. మొద‌టి రోజు విజ‌య‌న‌గరం రూర‌ల్ లో బ‌డిపిల్ల‌ల‌కు దిశ జాగృతి యాత్ర ద్వారా చైత‌న్యం ప‌ర‌చిన పోలీసులు..రెండో రోజు..పూస‌పాటిరేగ‌,డెంకాడ‌ల‌లోప‌ర్య‌టిచింది. తాజాగామూడోరోజన గుర్ల‌,గ‌రివిడి పోలీస్ స్టేష‌న్ల ప‌రిధిల‌లో ఉన్న పాఠ‌శాల‌ల పిల్ల‌ల‌ను చైత‌న్య ప‌రిచేయ‌త్నం చేసింది..దిశ జాగృతి యాత్ర‌. ఇందులోభాగంగా…జిల్లాలోని గుర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు  చేరుకుంది.

ఈ మేర‌కు  దిశ జాగృతి బృందం  పాఠ‌శాల‌ను సందర్శించి ఈ దిశ‌జాగృతి యాత్ర ద్వారా..పిల్ల‌ల్లో  చైత‌న్యం తీసుకువ‌చ్చే య‌త్నం చేసింది. ఈ సంద‌ర్బంగా విజ‌య‌న‌గ‌రం రూర‌ల్ సీఐ మంగ‌వేణి,గుర్ల ఇంచార్జ్ ఎస్ఐ నారాయ‌ణ‌రావు… విద్యార్థులను సత్ప్రవర్తనతో మెలిగి, ఉన్నత లక్ష్యాలను సాధించాలని, ప్రలోభాలు, వ్యామోహాలకు గురి కావొద్ద‌న్నారు.

అలాగే  సోష‌ల్ మీడియాలో కాస్త జాగూర‌త‌తో ఉండాల‌ని, మహిళల రక్షణకు ముఖ్యంగా ఆడ‌పిల్ల ర‌క్ష‌ణ‌కై  ప్రత్యేకంగా రూపొందించిన చట్టాలు రూపొందించ‌బ‌డ్డాయి..తెలియ చేసారు. అందు లోభాగ‌మేఈ దిశా యాప్ అని చూపెడుతూ…దాన్ని ప‌పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. తాము ఎదుర్కొంటున్న వేధింపులపై విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు దిశా ఫిర్యాదు బాక్సులను పాటశాలలో ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమంలో విజయనగరం రూరల్ సిఐ టి.ఎస్.మంగవేణి, గుర్ల ఇన్ చార్జ్ ఎస్ఐ పి.నారాయణ రావు, గాయకులు గజల్ గాంధీ, పాఠశాల ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

ఆడ‌పిల్ల‌ల ర‌క్ష‌ణ కోస‌మే దిశ యాప్…!

దిశ యాప్  తో ఖాకీలు అభ‌యం ఇస్తున్నారు….రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోన పోలీస్ బ్యారెక్స్ లో   ఆడ‌పిల్ల‌ల ర‌క్ష‌ణ‌కై  ప్రారఃంభమైన దిశ జాగృతి  యాత్ర‌.. విజ‌య‌న‌గ‌రం  పోలీస్ స‌బ్ డివిజ‌న్ లో ప‌ర్య‌టిస్తోంది. గుర్ల  లో ప‌ర్య‌టించిన యాత్ర‌… ఆ ప‌క్క‌నే ఉన్న గ‌రివిడి పోలీస్ స్టేష‌న్  ప‌రిధిలో ప‌ర్య‌టించింది.ఈ మేర‌కు గ‌రివిడి ఎస్ఐ లీలావ‌తి…దిశ జాగృతి యాత్ర‌కు స్వాగ‌తం ప‌లికి…ముఖ్య‌మైన కూడ‌లిలతో పాటు పాఠ‌శాలలో పిల్ల‌లకు మ‌రీ ముఖ్యంగా విద్యార్ధినీలకు యాత్ర ద్వారా వారిలో చైత‌న్యం తీసుకుచ్చారు.ఇందులో భాగంగా  కొండపాలెం (గరివిడి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దిశ జాగృతి బృందం సందర్శించింది.

విద్యార్థులను సత్పవ‌ర్త‌న తో మెలిగి, ఉన్నత లక్ష్యాలను సాధించాలని కోరారు. ప్రలోభాలు, వ్యామోహాలకు గురి కావొద్ద‌ని.,మహిళలకు అందునా ముఖ్యంగా అమ్మాయిల ర‌క్ష‌ణ‌కు సంబంధించి  ప్రత్యేకంగా రూపొందించిన చట్టాలు, దిశా యాప్ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇక వాళ్లు ఎదుర్కొంటున్న  వేధింపులపై విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు  ప్రత్యేకించి  దిశా ఫిర్యాదు బాక్సులను పాటశాలలో ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమంలో బొబ్బిలి డి.ఎస్పీ బి.మోహన రావు, చీపురుపల్లి సి.ఐ, సంజీవ రావు, , గాయకులు గజల్ గాంధీ, పాఠశాల ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

ఒక పూట అన్నం మానేసి పేదలకు పంచిపెట్టండి

Satyam NEWS

కాకాని రమణారెడ్డికి ఎంపీ ఆదాల శ్రద్ధాంజలి

Bhavani

దారుణం

Murali Krishna

Leave a Comment