Slider నిజామాబాద్

హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం

#dtovani

హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని జిల్లా రవాణాశాఖ అధికారిని వాణి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోటరీ క్లబ్ భవనంలో హోండా షో రూం ఆధ్వర్యంలో హెచ్ స్మార్ట్ హోండా న్యూ స్కూటీ లాంచింగ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. న్యూ స్కూటీ లాంచింగ్ చేసి స్కూటీ ప్రత్యేకతలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. షో రూం వారికి శుభాకాంక్షలు తెలిపారు.

షో రూంలో కొత్త బైక్ తీసుకోగానే సంబర పడిపోవద్దన్నారు. షోరూం వాళ్ళు ఇచ్చే హెల్మెట్ ను కూడా విధిగా వాడాలని సూచించారు. లక్ష రూపాయలు వెచ్చించి కొన్న మొబైల్ సేఫ్టీ కోసం పౌచ్ వాడటం ఎంత ముఖ్యమో జీవితాన్ని కూడా అలాగే సేఫ్ గా ఉంచుకోవాలన్నారు. ప్రతి 300 ద్విచక్ర వాహనాల ప్రమాదం ఘటనలో చనిపోయే వారిలో 275 మంది హెల్మెట్ లేకుండానే జరుగుతున్నాయన్నారు.

తద్వారా విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని తెలిపారు. మైనర్ డ్రైవింగ్ నేరమని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని కోరారు. లేకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో షోరూం ఇంచార్జి ప్రకాష్, సేల్స్ మేనేజర్ రమేష్, సర్వీస్ మేనేజర్ రంజిత్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఎర్రకోటను తాకిన వరద నీరు

Bhavani

సొల్యూషన్: హైదరాబాద్ నుంచి పని చేస్తున్న ఎన్నికల కమిషనర్

Satyam NEWS

రీడ్ ఇండియా సెలబ్రేషన్ ఫైనలిస్టుల జాబితా ఇదే

Satyam NEWS

Leave a Comment