40.2 C
Hyderabad
April 29, 2024 16: 16 PM
Slider ముఖ్యంశాలు

ఎర్రకోటను తాకిన వరద నీరు

#the Red Fort

దేశ రాజధాని ఢిల్లీలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు లేకపోయినా యమునా నది ఉప్పొగుతోంది. ఢిల్లీని వరదలు ముంచెత్తుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో ఢిల్లీకి వరద ముప్పు పొంచి ఉంది. హత్నీకుండ్ బ్యారేజీ గేట్లు ఎత్తివేయడంతో యమునా నదిలో నీటి మట్టం ఆల్‌టైం రికార్డు స్థాయిలో పెరుగుతోంది.

ఇదిలా ఉండగా వరద నీరు కారణంగా ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ప్రధాన రహదారులు, వీధులు నదులను తలపిస్తున్నాయి. తాజాగా ఈ వరద ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్ర కోటను కూడా తాకింది. దీంతో ఎర్రకోట చుట్టూ ఉన్న రోడ్లన్నీ మోకాళ్ల లోతు వరద నీటితో నిండిపోయాయి. కనుచూపు మేర నీరు తప్ప రోడ్డు కనిపించని దుస్థితి నెలకొంది.

యమున నది గరిష్ట నీటి మట్టంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. 45 ఏళ్ల రికార్డును తుడిచిపెడుతూ 208.66 మీటర్ల గరిష్ట నీటి మట్టంతో ప్రవహిస్తోంది. ప్రమాదకర స్థాయి కంటే మూడు మీటర్లు ఎగువన ప్రవహిస్తోంది. 1978లో నీటి మట్టం 207.49 మీటర్లకు చేరడంతో ఢిల్లీని భారీ వరదలు ముంచెత్తాయి.

మరోవైపు భారీ వర్షాలకు తోడు వరద ముప్పు పొంచి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే సహాయక చర్యల నిమిత్తం 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఢిల్లీలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, కాలేజీలకు సెలవు ప్రకటించారు..

Related posts

ధరణి అంశాల పై కలెక్టర్ లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

Satyam NEWS

కారు, బస్సు మధ్య నలిగిపోతున్న కమలనాథులు

Satyam NEWS

నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కృషి చేస్తా

Satyam NEWS

Leave a Comment