39.2 C
Hyderabad
April 30, 2024 21: 20 PM
Slider విజయనగరం

ఉత్తరాంధ్రలో కొన‌సాగుతున్నబంద్

Police

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా వామపక్ష పార్టీలు బంద్ నకు పిలునివ్వడం…దానికి ఏపీ ప్రభుత్వం కూడా మద్దతు పలకడంతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. రాత్రి తొమ్మిది గంటలకు అన్నిఆర్టీసీ డిపోలకు రాష్ట్ర ప్రభుత్వం బస్సులు నడపొద్దని ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని అన్ని డిపోల నుంచీ ఒక్క బస్సు కదలలేదు. దీనికి తోడు బందోబస్తు పోలీసు శాఖ కూడా తమ సిబ్బంది నియ‌మించింది. ఈ మేరకు విజయనగరం ఆర్టీసీ డిపో మేనేజర్ బాపిరాజు తెల్లవారుజామున నుంచే ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సులు రాకపోకల‌ను పర్యవేక్షించారు. బస్సులు నడపొద్దని రాత్రి మాకు సమాచారం వచ్చాందన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటవరకు డిపోల నుంచీ ఒక్క బస్సు తీయకూడదని ఆదేశాలు వచ్చాయన్నారు. మధ్యాహ్నం నుంచీ బస్సులు నడుస్తాయని తెలిపారు. మరో వైపు జిల్లా పోలీసు శాఖ కూడా బంద్ నకు సంబంధించి ప్రతీ చోట సిబ్బందిని పెట్టారు. ఎస్పీ రాజకుమారీ ఆదేశాల మేరకు ఆర్మడ్ రిజర్వ్ డీఎస్పీ శేషాద్రి తన సిబ్బంది ని జిల్లాలోని పార్వతీ పురం, బొబ్బిలి, సాలూరు, గజపతినగరం, నెల్లిమర్ల ప్రాంతాలకు బంద్ నకు సంబంధించి బందోబస్తుకై పంపించినట్టు తెలిపారు. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా బంద్ ను మద్దతు పలకడంతో వామపక్షాలు… ర్యాలీలు నిర్వహించేందుకు సిధ్ధమయ్యారు

Related posts

మట్టి గణపతి విగ్రహాలు ప్రతిష్టించాలి

Bhavani

క్లిష్ట సమయంలో నిబంధనలు అతిక్రమిస్తున్నారు…వారే

Satyam NEWS

ముందస్తు ఎన్నికల ఉహగానాలకు పుల్ స్టాప్ పెట్టిన జగన్

Satyam NEWS

Leave a Comment