40.2 C
Hyderabad
May 2, 2024 16: 08 PM
Slider ఖమ్మం

నాగరమంతా విడిఎఫ్ రోడ్లు

#VDF roads

నగరం ప్రతి డివిజన్‌లో సువిశాలమైన అత్యధునిక టెక్నాలిజీతో విడిఎప్‌ రోడ్ల నిర్మాణం చేసి ప్రదాన రహదారులకు అనుసంధానం చేయడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. శుక్రవారం మంత్రి 52 వ డివిజన్‌ ఎన్‌.ఎస్‌.టి రోడ వద్ద ఎస్‌డిఎప్‌ నిధులు రూ.90 లక్షలతో నిర్మించనున్న సి.సి డ్రైన్‌ నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం నగరాన్ని అన్ని హంగులతో అభివృద్ధి పరచి సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు కోట్ల నిధులను మంజూరు చేయించి రహదారులు, జంక్షన్లు, పార్కులు వాక్‌వేలు, సెట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేసి నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం జరిగిందని మంత్రి తెలిపారు.

కార్యక్రమంలో నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌, నగరపాలక సంస్థ కమీషనర్‌ ఆదర్శ్‌ సురభి, మున్సిపల్‌ ఇ.ఇ కృష్ణలాల్‌, కార్పోరేటరు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాంచరణ్, ఉపాసన లకు కూతురు

Bhavani

ఏపికి పట్టిన కుల వైరస్ కరోనా కన్నా చెడ్డది

Satyam NEWS

మధ్యప్రదేశ్ మధ్యంను స్వాధీనం చేసుకున్న మంగళగిరి సెబ్ పోలీసులు

Satyam NEWS

Leave a Comment