29.7 C
Hyderabad
April 29, 2024 09: 59 AM
Slider మహబూబ్ నగర్

వస్తు రవాణ వాహనాలకు జిల్లా పోలీసు అనుమతి పొందాలి

addl sp Wanaparthy

కరోనా వైరస్ నివారణ కోసం అమలౌతున్న దేశవ్యాప్త లాక్ డౌన్ లో భాగంగా నిత్యావసర వస్తువులకు ఏ ఆటంకం కలగకుండా ఉండేందుకు వస్తు రవాణ వాహనాలకు జిల్లాలో పోలీసుల నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని వ్యాపారస్తులకు, రవాణాదారులకు అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు.

ముందస్తు అనుమతి లేకపోవడంతో అన్ని రకాల వాహనాలు ఇష్టానుసారంగా తిరుతున్నాయని, దీనిని అలుసుగా తీసుకొని ఇతర దేశాలనుండి, ఇతర రాష్ట్రాలనుండి వచ్చిన వారిని అనుమతి లేకుండా, ఏ సమాచారం ఇవ్వకుండా చేరవేస్తుండడంతో అలాంటి వారిలో కరోనావైరస్ పాజిటివ్ ఉన్నవారు ఉండవచ్చని ఆయన అన్నారు.

అందుకే ఖచ్చితంగా వాహనం నెంబరుతో అనుమతి పొందాలనీ అదనపు ఎస్పీ తెలిపారు. అత్యవసర సహాయం కోసం వనపర్తి జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్  08545-233331, 08545-231100  నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించి  సహాయం తీసుకొని పోలీసువారి సూచనలు పాటించాలని వాహనదారులను, వ్యాపారులను అదనపు ఎస్పీ కోరారు.

Related posts

సూప‌ర్ఉమెన్ మూవీ ఇంద్రాని నుండి న‌టి ఫ్ర‌నైట జిజిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

Satyam NEWS

జిందాల్ స్టీల్స్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి

Satyam NEWS

జన చైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం

Satyam NEWS

Leave a Comment