28.7 C
Hyderabad
April 28, 2024 05: 03 AM
Slider ప్రత్యేకం

గిఫ్ట్ టు హానెస్ట్:ఈ.ఓ కృష్ణ వేణి సస్పెన్షనా?బ(ది)లి నా ?

e.o krishna veni

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ ఈ.ఓ ,ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి పై అధికారులు చర్యకు సిద్ధమయ్యారు.వేములవాడ దేవాలయం లో పారిశుద్యం సరిగా లేదని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేవాలయం శానిటేషన్ ఇంచార్జి ను,అక్కడి దేవాలయ పర్యవేక్షకున్ని సస్పెండ్ చేయమని కలెక్టర్ ఈ.ఓ ని ఆదేశించగా తాని చేయనని ఈ.ఓ మొండికేయడం తో కలెక్టర్ ఈ విషయాన్నీ ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలుస్తుంది.

తన అడ్మినిస్ట్రేషన్ అధికారిగా ఉన్న ఒక జిల్లాలో తన పరిధిలోని ఒక దేవాలయ ఈ.ఓ తన మాట వినడం లేదని అయన ఆగ్రహం గా ఉన్నట్లు తెలుస్తుంది.ఈ సంఘటనతో ఆలయ ఉద్యోగ వర్గాలలో నిరసన వ్యక్తమవుతోంది.తన సిబ్బంది సరిగానే పనిచేశారని అక్కడా పేరుకు పోయిన చెత్త వేములవాడ మున్సిపల్ పరిధి లోనిదని ఆమె తెలుపుతూ తాని ఎలాంటి చర్యలు తీసుకోనని మొండికేయడం తో ఈ.ఓ ఫై చర్యా తీసుకోవడానికి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది.


ఈ.ఓ బలి పశువు కాక తప్పదా?
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ ఈ.ఓ ,ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి వేములవాడ కు బదిలీ పై వచ్చాక నిజాయితీగా ఎలాంటి పైరవీలకు తావివ్వకుండా తన పని తానూ చేస్తూ ఉంది.ఆలయం లో జేపీక్యానికి అలవాటు పడ్డ నాయకులకు,కొందరు ఉద్యోగులకు ఇది రుచించడం లేదు.మొదట పేదవారికి దర్శనం కలగాలని వి ఐ ఫై లకు కూడా ప్రోటోకాల్ ఉంటె దర్శనం చూపించండి అని చెప్పిన ఈ.ఓ పై కొందరు కక్ష గట్టారు.దీనికి తోడు ఎండోమెంట్ ప్రధాన కార్యాలయం నుండి వచ్చిన కొన్ని ఉత్తర్వులను పక్కన పెట్టడం కమిషనేర్ లాంటి అధికారులకు కంట గుంపుగా తయారయింది.

ఇవన్నీ తెలిసిన ఈ.ఓ రెండు నెలలుగా తన డ్యూటీ తాను చేస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసింది.సమ్మక్క సారలమ్మ జాతర నేపత్యం లో వేములవాడకు విచ్చేసే భక్తులకు నిరంతరం దర్శనం సాఫీగా జరిగిలే చూడ గలిగింది.మరో వారం రోజులైతే ఈ రద్దీ తక్కువ కానుండగా ఈ.ఓ,సిబ్బంది సరిగా పనిచేయడం లేదని తమకు పిర్యాదులు అందుతున్నాయని అధికారులు వేములవాడ దేవాలయం లో ఆకస్మిక తనిఖీలు చేస్తుండటం అందరిని కలవర పెడుతుంది.అంతర్గతం ఎదో జరుగుతుందనే ఎవరో బాలి కాకా తప్పదని స్థానికులు గుసగుసలాడుతున్నారు.


అసలేం జరుగుతుంది..? సెలవుపై వెళ్లిన ఆమెను ఎందుకు వెనక్కి పిలిఛారు ?
లక్షలాదిమంది యాత్రికులు నిరంతరం వేములవాడ చేరుకుంటుండగా ఒక పద్దతి తో నిజాయితీగా వారికి దర్శన సౌకర్యం కలిగిస్తున్న ఈ.ఓ కృష్ణవేణి సిబ్బందిని సైతం దూరం పెడుతూ తానె స్వయం గా క్యూ లైన్ లను జరుపుతూ సేవలందించింది.పగలు రాత్రిని తేడాలేకుండా భక్తులకు నిరంతర దర్శన సౌకర్యం కల్పించింది.ఇంట పెద్ద సంఖ్యలో వేములవాడ కు భక్తులు శివరాత్రికి కూడా రారు.శివరాత్రి సమయం లో వేలాదిమంది పొలిసు,రెవిన్యూ సిబ్బందిని నియమించే జిల్లా అధికారులు ఈ రెండు నెలలు ఇటు వైపు చుసిన పాపాన పోలేదు.కోతికి పైగా బడ్జెట్ ఉండే శివరాత్రికి ముందుకు వచ్చే యంత్రాంగం లక్షలాది భక్తులు వేములవాడ చేరుకుంటున్న ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

పై గా ఎన్నికల హడావుడిలో తలమునకలై జాతరను పట్టించుకోలేదు .తూ తూ మంత్రంగా శివరాత్రి జాతర సమావేశాన్ని ముగించి భోజనాలు చేసి వెళ్లిన ఆ అధికారులు ఇప్పుడు ఎందుకు హాడావుడి చేస్తున్నారో అర్ధం కావడం లేదు.బ్రష్టు పట్టిన ఆలయ పరిస్థితిని తిరిగి గాడిలోపెట్టిన ఈ.ఓ పై ఎందుకు కక్ష సాధిం చర్యలు చేపాట్టారు అనేది అర్ధం కావడం లేదు.గాడి తప్పిన పాలన వ్యవస్థానను సరిచేసే క్రమంలో నిజాయితీ గా ఆమె ఇబ్బందులు ఎదుర్కుంటుడుడై కూడా.ఈ నేపత్యం లో వారం రోజులుగా ముఖ్యంగా గా గత రెండు రోజులుగా జరుగుతున్నా పరిణామాలు ఆమె పై చర్యలు తీసుకునే విధంగానే కనిపిస్తున్నాయి

పదిహేను రోజుల సెలవు ఫై వెళ్లిన ఆమె సెలవు రద్దు చేసి వెనక్కి పిలిచి నిన్న కమిషనర్ అనిల్ కుమార్ వచ్చి ఆకస్మిక తనిఖీ చేసి సిబ్బందికి హెచ్చ్రికలు జారీ చేసిన క్రమం లో నేదియూ జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి ఆమెను సిబ్బంది పై చర్యలు తీసుకొమ్మనడం ,ఆమె నిరాకరించడం అంటా ఒక కుట్ర లా కనబడుతుందని ఆలయ ఉద్యోగులు కొందరు వ్యాఖ్యానించారు.దక్షిణ ద్వారం రోడ్డు పై న ఉండాగా అక్కడ పేరుకు పోయిన చెత్త మున్సిపల్ డా లేక ఆలయాన్ని డా అనే విషయమై ఈ వివాదం చెలరేగగా స్థానిక మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ ఈ.ఓ తో వాగ్వాదానికి దిగడం అధికారుల అండతో నే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.మొత్తానికి వివాదం చినికి చినికి గాలి వానలా మారడం తో ఆలయ వర్గాల్లో ఆందోళన నెలకుంది.


శివరాత్రి కోసమే ఆమె ఫై బ( ది)లి తప్పదా ?
కాగా దీనికంతటికి కారణం ఆమె ఎండోమెంట్ ప్రధాన కార్యాలయం లో నిక్కచ్చిగా వ్యవహరించడం,ఇక్కడ కూడా రానున్న రోజుల్లో శివరాత్రి జాతరకు బిల్లుల విషయం లో ఆమె సహరించాడనే ముందు జాగ్రత్త గానే ఆమె పై చర్యకు అధికారులు సిద్దమై నట్లు తెలుస్తుంది.తమకు తలనొప్పిగా ఉన్న నిజాయితీ గల ఈ.ఓ ను బలి పశువును చేయాలనే తెరవెనుక కొందరు పావులు కదుపుతున్నట్లు జనం వ్యాఖ్యానిస్తున్నారు.దీనికి తోడు స్థానిక ఎమ్మెల్యే తో కూడా ఈమెకు పొసగడం లేదని వార్తలు వెలువడుతున్నాయి.

ఏనుగు ఎల్లింది తోక చిక్కింది అన్న చందంగా మరో వారం రోజుల్లో ఈ జన ప్రభావం తగ్గ నుండగా ఇప్పుడు వచ్చి ఈ.ఓ ను సిబ్బంది ని జిల్లా కలెక్టర్ హెచ్చరించడం పై పలువురు బాహాటం గానే విమర్శిస్తున్నారు.ఏది ఏమైనా ఈ వ్యవహారంలో ఎం జరుగుతుందో ఎవరిపై ఎవరు చర్యలు తీసుకుంటారో కాలమే నిర్ణయించాలి.

Related posts

హనుమంత వాహనంపై వేంకటాద్రిరాముడు

Satyam NEWS

గాంధర్వగానం

Satyam NEWS

‘నేను-తెలుగుదేశం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

Satyam NEWS

Leave a Comment