38.2 C
Hyderabad
May 1, 2024 22: 03 PM
Slider హైదరాబాద్

ఖైర‌తాబాద్ పెడెస్ట్రియ‌ల్ ప్రాజెక్ట్, వ‌ర్టిక‌ల్ గార్డెన్‌ ప్రారంభం

aravind 1

హైద‌రాబాద్‌ లోని ఖైరతాబాద్ జంక్షన్ లో  రూ. 68 లక్షలతో అభివృద్ధి చేసిన పెడెస్ట్రియ‌ల్‌ ప్రాజెక్ట్, వెర్టికల్ గార్డెన్, ఎల్ ఈ డీ లైట్లను ప్రిన్సిపల్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ ప్రారంభించారు. హైదరాబాద్ నగరాన్ని పర్యావరణహితంగా, పాదచారుల ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.

రద్దీగా వుండే ఈ ప్రాంతంలో ప్రయాణించే వారి సౌకర్యార్థం రూ 40 లక్షలతో ఫుట్ పాత్ సుందరీకరణ, ఫౌంటెన్లు, ఎల్ ఈ డీ  సెంట్రల్ లైటింగ్, మార్కింగ్, డివైడర్లు ఏర్పాటు చేశారు. అలాగే 265 మీటర్లు పొడవున ఖైరతాబాద్ బ్రిడ్జి కి వెర్టికల్ గార్డెన్ ఏర్పాటు చేశారు. 45 రోజులలో పెడెస్ట్రియ‌ల్‌ ప్రాజెక్టును పూర్తిచేశారు. ప్ర‌పంచ స్థాయి ప్ర‌మాణాల‌తో పాద‌చారుల భ‌ద్ర‌త‌కై అన్ని జాగ్ర‌త్త‌లతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు.

ఈ కార్య‌క్ర‌మంలో అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ (ట్రాఫిక్‌) అనిల్ కుమార్‌, జోన‌ల్ క‌మిష‌న‌ర్ ముషారఫ్ అలీ, డిప్యూటి క‌మిష‌న‌ర్ గీతారాధిక‌, ఇఇ న‌ర్సింగ‌రావు, యు.సి.డి డిడి శ్రీనివాస్‌, ఎల‌క్ట్రిక‌ల్ ఇఇ గ‌ణేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

ఉత్త‌రాంధ్ర ఇల‌వేల్పును ద‌ర్శించుకున్న కేంద్ర మంత్రి మాండ‌వీయ‌…!

Satyam NEWS

మన పరిసరాలను మనమే శుభ్రం చేసుకుందాం

Satyam NEWS

యూట్యూబ్‌ చూసి భార్యకు ప్రసవం.. బిడ్డకు జన్మనిచ్చి తల్లి మృతి

Bhavani

Leave a Comment