31.7 C
Hyderabad
May 2, 2024 10: 41 AM
Slider చిత్తూరు

పశు సంచార ఆరోగ్య సేవ వాహనాన్ని ప్రారంభించిన మంత్రి ఆర్కే రోజా

#roja

చిత్తూరు జిల్లా నగరి లో డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ వాహనాన్ని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖా మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. పశు సంవర్థక అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలో నేడు ఈ కార్యక్రమం జరిగింది.

నిజంగా ఇలాంటివి చూస్తున్నపుడు చాలా  ఆశ్చర్యంగా ఉంది, జగనన్న  చాలా లోతుగా ఆలోచించి పరిష్కారాన్ని వెతుకుతున్నారని స్పష్టంగా అర్థమవుతుందని మంత్రి రోజా అన్నారు. పశు పాడి రైతులకు భరోసా ఇవ్వాలని ఈ వాహనం తీసుకురావడం జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా రూ.278.00 కోట్లతో 340 వెహికల్స్ ను ఇప్పటి వరకు ఇచ్చారని ఆమె తెలిపారు. అలాగే దీనిని వాహనం టోల్ ఫ్రీ నంబరు 1962 కు చేసి రైతు పేరు, మండలం పేరు, పశువు కు వచ్చిన అనారోగ్యం గురించి చెబితేవారు సంచార వాహనాన్ని ఉపయోగించి వైద్యం చేస్తారని మంత్రి వివరించారు.

అవసరమైతే శస్త్ర చికిత్సలు కూడా చేసి రైతును, ఆ పశువును వారి ఇంటివరకు ఉచితంగా చేరుస్తారు అని తెలిపారు. ఈ వాహనం కూడా అధునూతన టెక్నాలజీ తో హైడ్రాలిక్ వసతి తో ఏర్పాటు చేశారని, ఈ వాహనం లో పశు వైద్యుడు, సహాయకుడు, డ్రైవర్ కం సహాయకుడు వుంటారు.

రైతులకు పంట తో ఎంత లాభం వస్తుందో అలాగే పాడి రైతు కు కూడా సమాన ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నందున ఆ రైతులకు సపోర్ట్ గా నిలిచారని తెలిపారు. ఇది పశువులకు మాత్రమే కాకుండా పెంపుడు జంతువులకు, పక్షులకు  కూడా వర్తిస్తుందని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల కు అనుసంధానంగా రైతులకు ఈ వాహనం గురించి అవగాహన కల్పించాలని కోరారు.

Related posts

తల్లీ బిడ్డల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు

Satyam NEWS

వి ఎస్ యూ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లకు జాతీయస్థాయి ప్రశంసలు

Satyam NEWS

ఒడిశాలో చైనా గూఢాచారి పావురాలు

Sub Editor

Leave a Comment