28.7 C
Hyderabad
April 28, 2024 09: 20 AM
Slider తెలంగాణ

తల్లీ బిడ్డల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు

satyavathi rothode

బాలికా దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా నేడు వనస్థలి పురంలో మహిళా-శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బేటీ పడావో-బేటీ బచావో కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ తల్లీ, బిడ్డల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. మహిళా , శిశు సంక్షేమ శాఖ భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తోందని ఆమె అన్నారు.

తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి అంగన్ వాడీల ద్వారా భోజనం ఇస్తున్నామని మంత్రి తెలిపారు. అదే విధంగా ఒంటరి మహిళలకు, వితంతువులకు, బీడి కార్మికులకు వృద్ధులకు 2016 రూపాయల పెన్షన్ ఇస్తోందని, ప్రభుత్వ దవాఖానాలో ప్రసవిస్తే, ఆడపిల్ల పుడితే 13000 రూపాయలను ప్రభుత్వం అందిస్తోందని. వీటితో పాటు కేసిఆర్ కిట్ కూడా అందిస్తోందని మంత్ర సత్యవతి రాథోడ్ తెలిపారు. ఆడపిల్ల పెళ్లి పేద తల్లిదండ్రులకు భారం కాకూడదని సిఎం కేసిఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 1,00,016 రూపాయలు ఇస్తున్నారని మంత్రి తెలిపారు.

Related posts

సిపిఐ అభ్యర్థుల గెలుపుకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు

Satyam NEWS

అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ప్రతిష్టకు శంకుస్థాపన

Satyam NEWS

అన్న క్యాంటిన్ల మూసివేతపై తీవ్ర నిరసనలు

Satyam NEWS

Leave a Comment