32.2 C
Hyderabad
May 2, 2024 02: 42 AM
Slider హైదరాబాద్

గ్రేట్ పర్సనాలిటీ: డాక్టర్ అంబేద్కర్ చరిత్ర అజరామరం

VHP Tribute

బాల్యం నుంచే అనేక అడ్డంకులు ఎదుర్కొని, భారత దేశానికే దిక్సూచి గా మారిన అంబేద్కర్ చరిత్ర  అజరామరం అని విశ్వహిందూ పరిషత్ (VHP)జాతీయ కార్యదర్శి సత్యం అన్నారు. మంగళవారం విశ్వహిందూ పరిషత్ (VHP) రాష్ట్ర కార్యాలయంలోని దత్త మందిరం లో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం నిర్వహించారు.  కులం పునాదుల పై ఒక జాతిని గాని, నీతిని గాని నిర్మించ లేరని కుండబద్దలు కొట్టిన మహనీయుడు అంబేద్కర్ అని సత్యం జి అన్నారు.

అంబేద్కర్ ఒక కులానికి, ఒక వర్గానికి పరిమితం కాదని సమస్త భారత జాతికే నీడనిచ్చే  గొడుగు లాంటి వాడని కొనియాడారు. నేడు పెరిగిపోతున్న మత మార్పిడులను అడ్డుకట్టవేసి అంబేద్కర్ వాదాన్ని విస్తరించాలని సూచించారు. ఉదయం సంఘ స్థాన్ కాగానే నిర్వహించిన ఈ కార్యక్రమంలో వి హెచ్ పి సామాజిక సమరసతా క్షేత్ర ప్రముఖ్ భాస్కర్ జి,  రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీ రాజేశ్వర్ రెడ్డి, ప్రాంత సహ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, రమణారెడ్డి, హరికృష్ణ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం మిఠాయిలు పంచుకున్నారు.

Related posts

15 నిమిషాలు ఆలస్యమైనా ప్రాక్టికల్స్ కు అనుమతి

Sub Editor 2

రాజకీయం చేయబోయిన కొమ్మినేనికి ఎదురుదెబ్బ

Bhavani

ఏడవకు తల్లీ…. ఈ దరిద్రపు లోకం ఇలాగే ఉంటుంది….

Satyam NEWS

Leave a Comment