అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన దారుణ సంఘటనలో మంటల్లో కాలిపోతున్న విజయారెడ్డిని కాపాడేందుకు అత్యంత సాహసోపేతంగా ప్రయత్నించిన డ్రైవర్ గురునాథం మరణించాడు. మంటల్లో కాలిపోతున్న తాహసీల్దార్ విజయారెడ్డిని కాపాడేందుకు చేసిన ప్రయత్నంలో భాగంగా గురునాథం శరీరంలో 80 శాతం కాలిపోయింది. సంఘటన జరిగిన తక్షణమే సమీపంలోని డిఆర్టీవో లో ఉన్న అపోలో ఆసుపత్రికి గురునాథాన్ని తరలించారు. అయితే గురునాథం చికిత్స పొందుతూ నేడు మరణించాడని అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు గురునాథం కుటుంబానికి విషయాన్ని తెలియపరిచారు. గురునాథం అత్యంత పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. తల్లిదండ్రులు గురునాథం మరణంతో నిస్సహాయులుగా మిగిలిపోయారు.
previous post