23.7 C
Hyderabad
May 8, 2024 05: 11 AM
Slider విజయనగరం

ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్షా కేంద్రాలను త‌నిఖీ చేసిన విజయనగరం క‌లెక్ట‌ర్

#suryakumariias

మూడోసారి రోజు కూడా విజ‌య‌న‌గ‌రం  జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ…. టెన్త్ పరీక్షా కేంద్రాల‌ను త‌నిఖీలు చేసారు.ఈ మేర‌కు  జిల్లాలోని పూస‌పాటిరేగ మండంలోని  ఏర్పాటు చేసిన ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్షా కేంద్రాల‌ను క‌లెక్ట‌ర్ త‌నిఖీ చేశారు. ముందుగా పూస‌పాటిరేగ జిల్లాప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌ను సంద‌ర్శించారు.

ప‌రీక్ష జ‌రుగుతున్న తీరును ప‌రిశీలించారు. ఈ పాఠ‌శాల‌కు 189 మంది విద్యార్ధుల‌ను కేటాయించ‌గా, అంద‌రూ హాజ‌ర‌య్యార‌ని సెంట‌ర్ ఛీప్ కె.ధ‌ర్మ‌కుమార్ తెలిపారు.అలాగేఅక్క‌డ నుంచీ కోనాడ జంక్ష‌న్‌లోని ఆర్డ‌ర్ స్కూల్‌ను సంద‌ర్శించి, ప‌రీక్ష నిర్వ‌హిస్తున్న తీరును ప‌రిశీలించారు.

ఈ పాఠ‌శాల‌కు 238 మంది విద్యార్థుల‌ను కేటాయించ‌గా, అంద‌రూ హాజ‌రైన‌ట్లు ప‌రీక్షా కేంద్రం ఛీఫ్ ఆర్‌.విజ‌య్‌కుమార్ తెలిపారు. అనంత‌రం అక్క‌డికి స‌మీపంలోని సెయింట్ ప్రాన్సిస్ స్కూల్లో ఏర్పాటు చేసిన ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్షా కేంద్రాన్ని సంద‌ర్శించారు. ఈ పాఠ‌శాల‌కు మొత్తం 180 మంది విద్యార్థుల‌ను కేటాయించ‌గా, ఒక్క‌రు గైర్హాజ‌రు అయిన‌ట్లు, సెంట‌ర్ ఛీఫ్ ఐ.రాజేశ్వ‌ర్రావు వివ‌రించారు. ప‌రీక్ష‌ల‌ను ప‌క‌డ్భందీగా నిర్వ‌హించాల‌ని, చూసిరాత‌ల‌కు నివారించేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఆయా సెంట‌ర్ల ఛీఫ్‌ల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

Related posts

అరసవెల్లిలో భక్తులకు పులిహోర ప్యాకెట్లు పంపిణీ

Satyam NEWS

పాక్ ఉగ్రవాదికి ఆహ్వానం: వివాదంలో మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ

Satyam NEWS

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో నేడు విశేష పూజలు

Satyam NEWS

Leave a Comment