29.7 C
Hyderabad
May 1, 2024 09: 38 AM
Slider విజయనగరం

భారీ వ‌ర్షాల‌పై విజయనగరం జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తం

#suryakumariias

భార‌త వాతార‌ణ ప‌రిశోధ‌న కేంద్రం అందించిన స‌మాచారం మేర‌కు రాగ‌ల మూడు రోజుల్లో జిల్లాలో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని, ఈ క్ర‌మంలో జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంద‌ని త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి తెలిపారు.

వివిధ విభాగాల ఆధ్వ‌ర్యంలో ప్ర‌జ‌ల‌కు త‌క్ష‌ణ స‌హాయం అందించే విధంగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొన్నారు. తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలను స్థానిక అధికారులు, స‌చివాల‌య సిబ్బంది ద్వారా అప్ర‌మ‌త్తం చేశామ‌న్నారు. విజయనగరం జిల్లా కలెక్టరు కార్యాలయం, ఆర్డీవో కార్యాలయంతో పాటు అన్ని తహసీల్దార్ కార్యాల‌యాల‌లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసిన‌ట్లు కలెక్టర్ వివ‌రించారు.

కంట్రోల్ రూమ్‌లు, ఫోన్ నెంబ‌ర్లు:

జిల్లా కలెక్టరు కార్యాలయం, విజ‌య‌న‌గ‌రం: 08922-236947

విజ‌య‌న‌గ‌రం రెవెన్యూ డివిజినల్ అధికారి కార్యాల‌యం: 08922-276888

చీపురుపల్లి రెవెన్యూ డివిజినల్ అధికారి కార్యాలయం: 94407 17534

బొబ్బిలి రెవెన్యూ డివిజినల్ అధికారి కార్యాలయం: 08944 – 247288

భోగాపురం: 80744 00947, పూసపాటిరేగ : 70367 63036.

విజయనగరం మత్స్యశాఖ కార్యాలయం: 08922-273812

విజ‌య‌న‌గ‌రం విద్యుత్ శాఖ కార్యాలయం: 94906 10102 ఈ ఫోన్ నెంబర్ ల ను సంప్రదించవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు.

Related posts

లయన్స్ క్లబ్ ఆఫ్ రాజంపేట ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్స్ డే

Satyam NEWS

దళిత కుటుంబంపై అధికార పార్టీ అమానుష దాడి

Satyam NEWS

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న అతి రుద్ర మహాయాగంలో అపశృతి

Bhavani

Leave a Comment