29.7 C
Hyderabad
April 29, 2024 10: 12 AM
Slider విజయనగరం

గంజాయి నిర్మూలనపై పోలీసుల ఉక్కు పాదం

#depika

వివిధ పోలీసు స్టేషను పరిధిలో నాటుసారా, మద్యం అక్రమ రవాణకు పాల్పడుతూ పట్టుబడిన వాహనాలను నిబంధనలు మేరకు వేలం వెయ్యాలని పోలీసు అధికారులను విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక  ఆదేశించారు. ఈ మేరకు డీపీఓలో జిల్లా ఎస్పీ ఎం.దీపిక వివిధ పోలీసు స్టేషన్ల పోలీసు అధికారులతో  సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల జిల్లాలో మరీ ముఖ్యంగా గంజాయి లభ్యమవడం, అదీగాక విజయనగరం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ప్యేకెట్లలో వన్ టౌన్ పోలీసులకు ..పిల్లలు, అందులో ఆడవాళ్లు అమ్మడంపై ప్రత్యేక దృష్టి సారించారు… జిల్లా ఎస్పీ దీపికా. ఈ క్రమంలో నిర్వహించిన సమీక్ష సమావేశం లో ఎస్పీ ఎం.దీపిక అటు ఎక్సైజ్ శాఖతో పాటు లా అండ్ ఆర్డర్ సిబ్బంది తో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మద్యం, నాటుసారా అక్రమ రవాణకు పాల్పడుతూ ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన కేసుల్లో, స్వాధీనం చేసుకున్న వాహనాలను నిబంధనలు మేరకు వేలం వేయాలని అధికారులను  ఆదేశించారు. వివిధ పోలీసు స్టేషను పరిధిలో స్వాధీనం చేసుకున్న వాహనాల యజమానులను గుర్తించి, వారికి నోటీసులను అమలు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే స్వాధీనం చేసుకున్న 191 వాహనాల యజమానులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. నిబంధనల మేరకు త్వరితగతి వేలం ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

విద్యార్థులు, ప్రజలకు గంజాయి వినియోగం వలన కలిగే అనర్ధాలను వివరించి, మత్తు పదార్థాలకు దూరం ఉండాలని కోరుతూ అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు చేపట్టాలన్నారు. విద్యార్ధులు, ప్రజల్లో చైతన్యం వచ్చే విధంగా ప్రత్యేకంగా రూపొందించిన హెర్డింగులను వివిధ పోలీసు స్టేషను పరిధిల్లోగల ముఖ్య కూడళ్ళలో ఏర్పాటు చేయాలన్నారు. కళాశాలలు, పాఠశాలలు, యూనివర్సిటీల్లో మత్తు పదార్ధాల వినియోగించే వారి సమాచారాన్ని సేకరించేందుకు సమాచార బాక్సులను ఏర్పాటు చేయాలన్నారు.

విద్యార్ధులు, ఉపాధ్యాయులు, లెక్చరర్స్ తో ఏంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. మత్తు పదార్థాలకు బానిసలైన వారికి అవసరమైన చికిత్స అందించేందుకు మండల స్థాయిలో పునరావాస కేంద్రాలను అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, మహిళా పోలీసులు, సెబ్, పోలీసు అధికారులు, వైద్యులతో వారికి కౌన్సిలింగు నిర్వహించే విధంగా చూడాలన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని విద్యార్థులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించాలని, ప్రజలకు గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలను వివరిస్తూ కర పత్రాలను విస్తృతంగా పంచాలన్నారు.

గంజాయి, మత్తు పదార్థాలు సమాచారంను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబరు 14500 పట్ల అందరికీ చేయాలని, మత్తు పదార్థరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చెయ్యాలని జిల్లా ఎస్పీ ఎం.దీపిక అధికారులకు దిశా నిర్దేశం చేసారు. కార్యక్రమంలో ఎస్.ఈ.బి. జాయింట్ డైరెక్టర్ అష్మ ఫర్ హీన్ మాట్లాడుతూ – వివిధ పోలీసు స్టేషనులో నమోదైన కేసులను, సీజ్ చేసిన వాహనాలను సమీక్షించి, వేలం ప్రక్రియ చేపట్టుటలో అధికారుల సందేహాలను నివృత్తి చేసారు.

ఈ కార్యక్రమంలో  టూటౌన్ సిఐ సిహెచ్. లక్ష్మణరావు, రాజాం సిఐ కే.రవికుమార్, బొబ్బిలి సిఐ ఎం. నాగేశ్వరరావు, వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కరోనా వైరస్ కన్నా ప్రమాదకరంగా మారిన పెగాసస్

Satyam NEWS

లక్ష్మారెడ్డి గెలుపుకోసం ముస్లీమ్ వెల్ఫేర్న కమిటీ తీర్మానం

Satyam NEWS

Un Lock 3.0: సినిమా ధియేటర్లకు పర్మిషన్ నో

Satyam NEWS

Leave a Comment