29.7 C
Hyderabad
May 2, 2024 05: 08 AM
Slider విజయనగరం

అమ్మా..పెద్దావిడవు..నువ్వే మాస్క్ గురించి అందరికి చెప్పాలి..

#RajakumariIPS

కరోనా సెకండ్ వేవ్..ప్రస్తుతం అమలవుతున్న 18 గంటల పాటు లాక్ డౌన్ పుణ్యమా.. కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ నివేదకలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ఈ నెల 31 తో పరిసమాప్తం కానుంది.

అయితే మరికొద్ది రోజుల పాటు లాక్ డౌన్ ను కొనసాగిస్తే సమూలంగా వైరస్ సర్వ నాశనం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ ను జూన్ 15 వరకూ కొనసాగించేలా సూచనలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ సడలింపు సందర్భంలో ఆయా జిల్లాల పరిస్థితి ఎప్పటికప్పుడు సంబంధిత ఎస్పీలు ,కమీషనర్ లు గ్రౌండ్ లెవిల్ లో పర్యవేక్షిస్తున్నారు. అందులో భాగంగా విజయనగరం జిల్లా లో త్వరలో డీఐజీగా చార్జ్ తీసుకోబోతున్న ప్రస్తుత ఎస్పీ రాజకుమారీ.. జిల్లా కేంద్రం లో పరిస్థితి ప్రత్యక్షంగా పరిశీలించారు.

అసలే శెలవు దినం ఆపై రద్దీ తో ఉన్న పీడబ్య్లూ మార్కెట్.. దీనికి తోడు నగరంలో ని రాజీవ్ స్టేడియంలో లో కూరగాయల వ్యాపారం.. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే.. నగరంలో రౌండ్లు తిరిగారు.

అస్సలు ముందు రోజు సాయంత్రమే లాక్ డౌన్ పరిస్థితిని ఎస్పీ  పరిశీలించాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల ముందు రోజు పర్యటన రద్దు అయ్యింది.

దీంతో మర్నాడు ఆదివారం ఉదయాన్నే ఏడుగంటల కే ఎస్పీ నగరంలో ప్రత్యక్ష మయ్యారు. న్యూపూర్ణ వద్ద పరిస్థితి ని ముందు రోజు కర్ఫ్యూ సడలింపు సమయంలో పరిశీలించిన ఎస్పీ..ఆ మర్నాడు ఉదయాన్నే కర్ఫ్యూ సడలింపు సమయంలో నే ఆదే న్యూపూర్ణ ప్రాంతాన్ని పరిశీలించారు.

కొద్ది రోజుల క్రితమే.. మార్కెట్ ను ఆ పక్కనే రాజీవ్ స్టేడియం కు తరలించారు. ఈ నేపథ్యంలో రెండు చోట్ల పరిస్థితి ని నిశితంగా ఎస్పీ పరిశీలించారు.

ఆ పక్కనే చిన్న ప్రదేశం లో మరికొంత స్థలానికి సీఐ మురళీ ,ట్రాఫిక్ ఏఎస్ఐ దాలినాయుడు, కరోనా టాస్క్ఫోర్స్ టీం లీడర్ ఆదిత్యలతో పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలీసులకు కొన్ని సూచనలు ఇచ్చారు. ఏదైనా పోలీసులు తీసుకుంటున్న ,చేపడుతున్న పకడ్బందీగా చర్యల వలన కరోనా తీవ్రత తగ్గిందంటోంది…సత్యం న్యూస్. నెట్.

Related posts

గెట్ రెడీ: లకారం పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

డాక్టర్లు, ఇంజినీర్లూ ఎమ్మెస్సీ చేయొచ్చు

Bhavani

కారుపై క‌మ‌లం అటాక్‌!!!

Sub Editor

Leave a Comment