35.2 C
Hyderabad
April 27, 2024 11: 57 AM
Slider హైదరాబాద్

కారుపై క‌మ‌లం అటాక్‌!!!

LB, Saroo, TRS

కారు స్పీడ్‌కు బ్రేకులు ప‌డ్డాయి. కారును క‌మ‌లం గుద్దెసింద‌ని (కారుపై క‌మ‌లం అటాక్ చేసింద‌ని) క‌మ‌ల నేత‌లు వ్యాఖ్యానిస్తుంటే .. కారే జీహెచ్ఎంసీని కైవ‌సం చేసుకుంద‌నే గులాబీ నేత‌లంటున్నారు.

ఈ నేప‌థ్యంలో ఎల్బీన‌గ‌ర్‌లో క‌మ‌లం (బీజేపీ) క్లీన్‌స్లీప్ చేయ‌గా, స‌రూర్‌న‌గ‌ర్‌లోనూ కారుకు బ్రేకులు వేసింది. దీంతో ఆయా ఆ పార్టీల నేత‌ల గుండెల్లో రైళ్ళు ప‌రుగెడుతున్నాయి. హ‌స్తానికి హ‌స్తం అందించిన నేత‌లు కాస్త ఆలోచ‌న‌లో ప‌డ్డారు.

హ్యాండిచ్చిన నేత‌లకు ప‌రాజ‌యంతో స‌రి

కాంగ్రెస్ (హ‌స్తం) గుర్తుపై గ‌త ఎన్నిక‌ల్లో గెలిచి కారునెక్కిన ఎల్బీన‌గ‌ర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మంత్రి, ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డిలు ప్ర‌యాణిస్తున్న‌కారు యాక్సిడెంట్‌కు (హ‌స్తానికి, కాంగ్రెస్‌కు హ్యాండిచ్చిన‌) గురైంది. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో క్లీన్‌స్వీప్ దిశ‌గా ప్ర‌యాణిస్తున్నామ‌న్నకారు కాస్తా యాక్సిడెంట్‌కు గుర‌వ్వ‌డంతో ఈ ఇరువురు నేత‌ల భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డింది.

ఎల్బీన‌గ‌ర్‌లో క‌మ‌ల వికాసం!

ఎల్బీన‌గ‌ర్ డివిజ‌న్‌లో మొత్తం 11 డివిజ‌న్ల‌కు గాను 11 డివిజ‌న్ల‌లో క‌మ‌లం (వ‌ర‌దలు ఎక్కువై నీరు ఎక్కువ‌గా పీల్చుకొని) విక‌సించింది. ఇక ఆయా డివిజ‌న్ల‌లో త‌మ‌దే గెలుప‌ని (జ‌బ్బ‌లు చ‌రుచుకున్న‌) నేత‌లు కాస్తా చ‌తికిలా ప‌డ‌డం రాజ‌కీయ విశ్లేష‌కుల‌ను సైతం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

ప్ర‌జా తీర్పు

ప్ర‌జా తీర్పు (డెమోక్ర‌టిక్ కంట్రీ) ఎవ్వ‌రికీ అతీతం కాద‌నే చెప్పాలి. ఎందుకంటే అస‌లే బాధ‌లో ఉన్న నిరుపేద‌ల‌, సామాన్య‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ప‌క్షాన కాంగ్రెస్ (హ‌స్తం) గుర్తుపై గెలిచిన ఈ ఇరువురు ఎమ్మెల్యేలు కాస్త (కారు) ఎక్క‌డంతో ఓట్లు వేసిన ఆయా ప్ర‌జ‌లంతా అనాథ‌లుగానే మిగిలిపోయారు. ఆ అనాథ‌లే నేడు త‌మ ఆవేద‌న‌ను వెళ్ల‌గ‌క్కారు. ఈ విష‌యం ఒకింత ఆవేద‌న‌కు గురి చేసినా ఇది మాత్రం ముమ్మాటికీ వాస్త‌వం (నిజం, స‌త్యం) అనే చెప్పుకోవాలి. అటు పిమ్మ‌ట జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఎమ్మెల్యేలు కారునెక్కి తామంతా నేత‌ల‌నే అన్న‌ట్లుగా ప్ర‌చార బ‌రిలో, అధికార బ‌రిలో, అన‌ధికార బ‌రిలో నిలిచి ఇష్టారీతిన వ్య‌వ‌హ‌రించార‌నే చెప్పుకోవాలి. దీని ఫ‌లిత‌మే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌ను (అక్ర‌మాల ఫ‌లిత‌మే) నేడు ప్ర‌స్ఫూటంగా ప్ర‌జాతీర్పులో క‌నిపించింది. అదే నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌ర‌ద‌లు ముంచెత్త‌డం కూడా యాద్రుచ్ఛిక‌మే!

శ్రీ‌కాంతాచారి మ‌ర‌ణం…

తెలంగాణ ఉద్య‌మానికి నిజంగా ఎవ్వ‌రైనా శివుని త‌ల నుంచి గంగ ఊబికి వ‌చ్చిన‌ట్టుగా తెచ్చారంటే అదీ ఎల్బీన‌గ‌ర్‌లోని శ్రీ‌కాంతాచారి తెగువ‌, ధైర్యం, నిజ‌మైన తెలంగాణ‌పై ప్రేమ, అభిమానం, మ‌న‌స్సాక్షిగా అనే చెప్పుకోవాలి. కానీ నేడు అదే శ్రీ‌కాంతాచారి నియోజ‌క‌వ‌ర్గంలో (ఎల్బీన‌గ‌ర్‌)లో వ‌ద‌ర‌లు వ‌స్తే మాత్రం నిజ‌మైన వ‌ర‌ద బాధితునికి కాకుండా స‌ద‌రు (కారు పార్టీ) నేత‌ల ఇళ్ళ‌కు, బంధు మిత్ర గ‌ణాల‌కే మాత్ర‌మే అందించి మిగ‌తా చేతులు దులుపుకున్నార‌నే విష‌యం వాస్త‌వం (స‌త్యం). శ్రీ‌కాంతాచారి మ‌ర‌ణంతో తెలంగాణ ఉద్య‌మం ఊబికి వ‌చ్చి ఇంతింతై వ‌టుడింతైన‌ట్లుగా మొత్తం తెలంగాణ‌లో పాకింది. (అస‌లు నిజంగా చూస్తే ఈ నియోజ‌క‌వ‌ర్గాన్నిశ్రీ‌కాంతాచారి నియోజ‌క‌వ‌ర్గంగా ప్ర‌క‌టించాల‌ని, వారి కుటుంబీల‌కే ఏ పార్టీలైనా టిక్కెట్టు ఇవ్వాల‌ని అనేకానేక డిమాండ్ ఉన్న‌ప్ప‌టికీ ఎవ్వ‌రూ ( ఏ పార్టీలూ) ప‌ట్టించుకున్న‌ పాప‌న పోలేదు). దీంతోనే తెలంగాణ విజ‌యం త‌థ్య‌మైంది. నేడు తెలంగాణ తెచ్చామ‌ని తామే గురువుల‌ని చెప్పుకుంటున్న(చొక్కాలేగ‌రేసుకుంటున్న‌) వారంతా డమ్మీ క్యాండెంట్ల‌ని చెప్ప‌క‌నే చెప్పొచ్చు. అందుకే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఆయా పార్టీ క్లీన్ స్వీప్‌కు గురైంది. ప్ర‌తిప‌క్షంలో ఉన్నపార్టీ కాస్త గ‌ద్దెనెక్కింది.

ఇక స‌రూర్‌న‌గ‌ర్‌..

అప‌జ‌యానికి మారుపేరు అనేది లేకుండా ఆది నుంచి కొన‌సాగిన ప‌టోళ్ళ స‌బితా ఇంద్రారెడ్డి కాస్త ఈ నియోజ‌క‌వ‌ర్గంలోని స‌రూర్‌న‌గ‌ర్‌లో ఉన్నరెండు డివిజ‌న్ల‌లో ఓట‌మి పాల‌వ్వ‌డం ఆమెను తీవ్రంగా క‌ల‌చి వేసిన‌ట్లుగా స‌మాచారం. దీంతో స‌బితా ఇంద్రారెడ్డి విశ్వ‌స‌నీయ‌త‌పై కూడా టీఆర్ఎస్ అధినాయ‌త్వం ఆలోచ‌న‌లో ప‌డింది. రెండు డివిజ‌న్ల‌లోనూ స‌బిత‌మ్మ ప‌ట్టు సాధించ‌కుంటే ఇక నియోజ‌క‌వ‌ర్గాన్ని మొత్తం ఏ విధంగా ఏలుతార‌నే అనుమానం అధిష్టానంలో మెస‌లుతోంది. హ‌స్తం నుంచి కారెక్కిన స‌ద‌రు ఎమ్మెల్యే కోరిక‌ల‌ను (టీఆర్ఎస్‌) అధినాయ‌త్వం మ‌న్నిస్తుందా? లేదా? అనేది మాత్రం ఇప్ప‌ట్లో స‌మాధానం చెప్ప‌లేని ప్ర‌శ్న‌గానే మిగిలిపోనుంద‌నేది వాస్త‌వం. ఇక భ‌విష్య‌త్‌లో స‌ద‌రు ఎమ్మెల్యే కారులోనే ఉంటారో? లేక మ‌రేదైనా (బండి) ఎక్కుతారో అనే విష‌యం కూడా స‌మ‌య‌మే నిర్ధారించాలి?

ప‌నిచేసిన బండి ప్ర‌చారం

ఇక క‌రీంన‌గ‌ర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన బండి సంజ‌య్ను బీజేపీ (క‌మ‌లం) అధిష్టానం కాస్త రాష్ర్ట అధ్య‌క్షుడిగా నియ‌మించ‌డం అటు పిమ్మ‌ట‌నే నెమ్మ‌దిగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల తీరు తెన్నుల‌ను పూర్తిగా ప‌రిశీలించిన బండి త‌దునుగుణంగా త‌న‌ను తాను రూపొందించుకోవ‌డం (స‌మాజంలో మార్పు అనేది చాలా ముఖ్యం.. స‌మాయానుసారంగా మ‌న‌మూ మార‌ల‌నేది స‌హ‌జం) బీజేపీ విజ‌యానికి నాందీ ప‌లికింది. లేకుంటే గ‌తంలో కేవ‌లం నాలుగు సీట్లు సాధించిన క‌మ‌లం కాస్త అర్థ శ‌త‌కం సాధించిందంటే బండి ప్ర‌వ‌ర్త‌నా తీరు ఎంత‌గా క‌మ‌లానికి స‌హ‌క‌రించింద‌నేది గుర్తించొచ్చు.

కారును ముంచేసిన క‌రోనా ముప్పు, వ‌ర‌ద స‌హాయం..

ఓ వైపు ఎల్బీన‌గ‌ర్‌, స‌రూర్‌న‌గ‌ర్ (నేడు టీఆర్ఎస్ ఓటమి పాలైన డివిజ‌న్లు)లో గ‌తంలో తామిచ్చిన తీర్పుతో గెలిచిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు (సుధీర్‌రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి)లు హ‌స్తానికి హ్యాండిచ్చి కారెనెక్క‌డంతోనే తీవ్ర‌మైన నిరాశ నిర్వేదంలో ఉండ‌గా, స‌మ‌యం కాస్త గ‌డిచిపోతుండ‌గా, క‌రోనా నేప‌థ్యంలో మ‌రో పిడుగు ప‌డింది. ఈ నేప‌థ్యంలో కూడా వారిరువూరు సామాన్య‌, నిరుపేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను ఆదుకున్న‌ది ఏమీ లేద‌నే చెప్పుకోవ‌చ్చు. ఇక ఆ వెనువెంట‌నే మ‌రో ఉప‌ద్ర‌వం వ‌ర‌ద రూపంలో వ‌చ్చి ప‌డ‌డంతో నిజ‌మైన ఆదుకునే స‌మ‌యంలో వారు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు ప‌ర్య‌ట‌న‌లు చేసిన‌ప్ప‌టికీ, ఆర్థిక స‌హాయంలో మాత్రం వివ‌క్ష చూపార‌నేది (స‌త్యం) వాస్త‌వం. వీట‌న్నింటినీ అంశాల వారీగా మ‌న‌సులో ఉంచుకున్న ఆయా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు కాస్త కారును (వ‌ర‌ద స‌హాయం) ముంచేశారు.

భ‌విష్య‌త్‌లో… ఏం జ‌ర‌గ‌నుంది?

స‌మ‌యం ఎవ్వ‌రికీ అతీతం కాదు.. స‌మ‌యం ఎవ్వ‌రికీ అనుకూలం కూడా కాదు.. ఆయా స‌మ‌యాల్లో నిరుపేద‌, సామాన్య‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఎవ్వ‌రైతే ద‌గ్గ‌ర‌వుతారో? వారినే విజ‌యం వ‌రిస్తుంద‌ని ప‌లుమార్లు ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లు తీర్పు నిచ్చారు. ఇవ‌న్నీజ్ఞ‌ప్తిలో ఉంచుకొని ఏ పార్టీయైనా మ‌నుగ‌డ సాధించాల‌నుకుంటే అంద‌రికీ స‌మ బ్యాలెన్స్‌గా వెళితే మంచిది. లేకుంటే మొద‌టికే మోసం జ‌రిగే అవ‌కాశమే ఎక్కువ‌గా ఉంది. ఈ నేప‌థ్యంలోనే పైన ప‌రిణామాల‌ను ప్ర‌తీ ఒక్క‌రూ ప‌రిశీలిస్తే ప్ర‌జ‌లు ఎవ్వ‌రికీ (టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, టీడీపీ, వైసీపీ, ఇత‌రులు) ఎప్ప‌టికీ విధేయులుగా ఉండ‌లేర‌నిది (స‌త్యం) వాస్త‌వం.

మొత్తానికి ఎల్బీన‌గ‌ర్‌, స‌రూర్‌న‌గ‌ర్ ప్ర‌జ‌లు వినూత్న‌మైన తీర్పు నివ్వ‌డంతో అధికార ప‌క్షానికి క‌ళ్ళు బైర్లు క‌మ్మాయ‌నే చెప్పాలి!!!

Related posts

‘మనం సైతం’కు వసుధ ఫౌండేషన్ భారీ వితరణ

Satyam NEWS

ఉపాధి కూలీలకు మాస్కులు, సానిటైజర్లు పంపిణీ

Satyam NEWS

రిమంబరింగ్: నేనూ నా డ్రైవింగ్ లైసెన్సు

Satyam NEWS

Leave a Comment