38.2 C
Hyderabad
April 28, 2024 20: 54 PM
Slider విజయనగరం

వెయ్యి రూపాయ‌ల కోసం ఎస్పీ మీడియా స‌మావేశం

#VijayanagaramSP

ఎక్క‌డైనా గ్రేవ్ అఫెన్స‌స్..న‌టోరియ‌ల్ క్రిమిన‌ల్స్ పట్టు బ‌డితే…ఎస్పీ స్థాయి ఉన్న‌తాధికారుల‌తో మీడియా సమావేశం నిర్వ‌హిస్తూ ఉంటారు. అయితే విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలో వెయ్యి రూపాయ‌ల విలువ చేసే దేవాల‌యపు సొత్తు దొంగ‌తనం కేసు లో స్వ‌యంగా జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ  మీడియా సమావేశం నిర్వహించ‌డం….సంచ‌ల‌నంగా మారింది.

అయితే ఇటీవేల గ‌త కొద్ది నెల‌ల నుంచీ వ‌రుస పెట్టి టెంపుల్ అఫెన్స‌స్ జ‌ర‌గ‌డం…అదీ గాక రాష్ట్రంలో ప‌లు దేవాల‌యాల‌లో దేవుని  విగ్ర‌హాల‌కు సంబంధిత దేవాల‌యాకు ప్ర‌తిష్ట క‌లిగించేలా ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం..పోలీస్ శాఖ కే పెను స‌వాల్ గా మారింది.

దీనికి తోడు రామ‌తీర్ధం నీలాచ‌లం కొండ‌పై ఏకంగా రాములోరి శిర‌స్సు ఖండ‌నలో కూడా..పోలీసుల దర్యాప్తు  ఏమే తేలక‌పోవ‌డంతో ప్ర‌భుత్వమే ఏకంగా స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్  కు కేసును అప్ప‌గించింది.

ఈ ప‌రిస్థితులలో విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలో రంగిరీజు వీధిలో జ‌రిగిన దేవాల‌యం లో హుండీ ఎత్తుకెళ్లిన ఘ‌ట‌న‌పై అతి కొద్ది గంట‌ల‌లోనే అందుకు గ‌ల కార‌కుల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు.

అయితే వ‌రుస పెట్టి రాష్ట్రంలో దేవాల‌యాలలో జ‌రిగిన‌ దొంగ‌త‌నాల‌పై దృష్టి సారించిన పోలీసులు.. ..చిన్న పామునైనా పెద్ద క‌ర్ర‌తో కొట్టాల‌న్న విధంగా… జ‌రిగిన దేవాల‌యంలో చోరీలో వెయ్యి రూపాయ‌ల సొత్తు,దాంతో పాటు రెండు మోటార్ సైకిళ్ల‌ను అప‌హ‌రించిన  ఘ‌ట‌న‌లో 4 నిందితుల‌ను వ‌న్,టూటౌన్ పోలీసులు వెంట‌నే ప‌ట్టుకున్నారు.

ఈ ఘ‌ట‌న‌పై వెను వెంట‌నే స్పెష‌ల్ బ్రాంచ్ ద్వారా…రాష్ట్ర పోలీసు శాఖకు అందునా క్రైమ్ వింగ్ కు చెప్పారు. అనంత‌రం…ఎల‌క్ష‌న్స్ బందోబ‌స్తు జ‌రుగుతున్న వేళ ఆఘ‌మేఘాల మీద‌. ఎస్పీ రాజ‌కుమారీ మీడియా స‌మావేశం పెట్టి మరీ…జ‌రిగిన దొంగ‌త‌నం గురించి చెప్పారు.

న‌గ‌రంలోని నాగ‌వంశ‌పు వీధికి చెందిన 20 ఏళ్ల  త‌ల్లాడ దుర్గా ప్ర‌సాద్,  ఓ బ‌ట్ట‌ల షాపులో సేల్స్ బాయ్ గా పని చేస్తూ రంగ‌రీజు వీధిలో ఉన్న టెంపుల్ హుండీని అప‌హ‌రించాడు. ప్ర‌సాద్ తో పాటు మ‌రో ముగ్గురు మైన‌ర్లు..రెండు మోటార్ సైకిళ్ల‌ను దొంగ‌లించారు.ఈ  నెల 7,8 తేదీల‌లో ఈ దొంగ‌త‌నాలు జ‌ర‌గడంతో ఐడీ పార్టీ సిబ్బందితో అటు వ‌న్ టౌన్,ఇటు టూటౌన్ పోలీసులు నిందితుల‌ను ప‌ట్టుకున్నారు.

ముసుగు వేసినా మీడియా ముఖం చూపించ‌ని నిందితుడు

ఎట్ట‌కేల‌కు మూడు రోజుల త‌ర్వాత టెంపుల్ అఫెండ‌ర్స్ ను ప‌ట్టుకున్న పోలీసులు….అందులో మేజ‌రైన నిందితుడు ప్ర‌సాద్…మీడియాకు ముఖం చూపించేందుకు నిరాక‌రించడం విశేషం.వ‌న్ టౌన్ పోలీసులు ఇచ్చిన సమాచారానికి ఎస్పీ వ‌చ్చిన‌ప్ప‌టికీ… దాదాపు అర‌గంట‌సేపు నిందితుల‌ను సీఐ రూమ్ లోకి తీసుకువెళ్లి విచారించ‌డం కొస‌మెరుపు.

Related posts

ఆదాలకు ముస్లిం నేతల ఘన సన్మానం

Satyam NEWS

టర్కీ ఎటాక్ :సిరియాలో హెలికాఫ్టర్​పై రాకెట్​ దాడి

Satyam NEWS

కార్మికుల ఆరోగ్యం పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment