28.7 C
Hyderabad
April 28, 2024 04: 02 AM
Slider విజయనగరం

క‌ర్ఫ్యూ స‌మ‌యం…రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో పోలీసుల త‌నిఖీలు

#SP Rajakumari

క‌ర్ఫ్యూ స‌మ‌యంలో విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీస్ శాఖ తీసుకున్న‌,చేప‌ట్టిన చ‌ర్య‌లు రాష్ట్ర వ్యాప్తంగా అమ‌ల‌వుతున్నాయా..? అదీ జిల్లా ఎస్పీ రాజుకుమారీ క‌ర్ఫ్యూ స‌మయంలో అలుపెర‌గ‌కుండా జిల్లా వ్యాప్తంగా అమ‌లు చేసిన ప‌నులు రాష్ట్ర వ్యాప్తంగా ఆద‌ర్శం కానున్నాయా..?  అవున‌నే అంటున్నారు…జిల్లా పోలీసులు.

క‌రోనా స‌మయంలో అదీ క‌ర్ఫ్యూ స‌మ‌యంలో ప్ర‌తీ రోజూ రోడ్ల‌మీదే తిరుగుతూ ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తునే ఉన్నారు…జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ. ఆ స‌మ‌యంలో మీడియాకు ప్ర‌త్యేకించి స‌మాచారం ఇవ్వ‌లేకుండానే..జిల్లా పోలీసు పీఆర్వో ద్వారా స‌మాచారం వ‌చ్చేది.

కానీ ఇంకా క‌ర్ఫ్యూ గ‌డువుకు ఇంకా మూడు రోజులు ఉండగానే ఒక్క‌సారిగా మీడియాకు స‌మాచారం….ఎస్పీ గారు విజ‌య‌న‌గ‌రం  జిల్లా కేంద్రంలో ప‌ర్య‌టిస్తారు..క‌వ‌రు చేయాల‌ని మ‌న‌వి అంటూ పోలీసు స‌మాచార విభాగం నుంచీ స‌మ‌చారం.

ఏంటా అని ఆరా తీస్తే క‌ర్ప్యూ స‌మ‌యంలో రోజూ విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ తిరిగి త‌ద్వారా మొత్తం శాఖ‌ను అప్ర‌మ‌త్తం చేసిన మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలు క‌ర్ఫ్యూ స‌మ‌యంలో  రోడ్ల‌పై తిరిగి..మీడియాకు స‌మాచారం ఇవ్వాల‌ని డీజీపీ నుంచీ ఆదేశాలు రావ‌డంతో…కొత్త‌గా లేక‌పోయిన‌ప్ప‌టికీ రాష్ట్ర డీజీపీ ఆదేశాలతో ఎస్పీ రాజ‌కుమారీ..సాయంత్రం 6 గంట‌లకు ముందే అంటే 5.30 ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్ష‌న్, కోట‌,మూడు లాంత‌ర్లు మీదుగా గంట‌స్థంబం వ‌ద్దకు వ‌చ్చి అక్కడే మీడియాతో మాట్లాడారు.

కర్ఫ్యూ సమయంలో ముందుస్తు అనుమతులు లేకుండా బయటకు రావొద్ద‌ని. జిల్లాలో ప్రధాన కూడళ్ళలో స్పెషల్ పార్టీ పోలీసులతో ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహిస్తున్నామ‌ని ఎస్పీ తెలిపారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఏపీ ఎపిడిమిక్ డిసీజెస్, చట్టాల క్రింద కేసులు నమోదు చేస్తామ‌ని మ‌రోసారి హెచ్చ‌రించారు. 

సాయంత్ర 6గంటల తర్వాత కర్ఫ్యూ అమలు సమయంలో రోడ్లపై తిరుగుతున్న వాహనాలను జిల్లా ఎస్పీ స్వయంగా నిలిపివేసి, కారణాలను అడిగి తెలుసుకొని, కౌన్సిలింగ్ నిర్వహించారు. మాస్క్  లేకుండా తిరుగుతున్న వారిని గుర్తించి, స్వయంగా మాస్కులు అందించి, తప్పనిసరిగా డబుల్ మాస్కు ధరించాలన్నారు..కర్ఫ్యూ అమలు సమయంలో అంతర్ జిల్లా చెక్ పోస్టులను వద్ద పోలీసు సిబ్బందిని నియమించి, అనుమతులు లేకుండా జిల్లాలోనికి ప్రవేశించకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. వైద్య సహాయం, అత్యవసర పరిస్థితుల్లో తప్పా ఎవ్వరూ బయటకు రావద్దని ప్రజలను జిల్లా ఎస్పీ కోరారు.

కరోనా నియంత్రణకే కర్ఫ్యూ అమలు చేస్తున్నామన్న విషయాన్ని ప్రజలంతా గుర్తించాలన్నారు. షాపులను మాత్రం సాయంత్రం 5గంటలకే మూసి వేయాల్సిందిగా వ్యాపారస్థులకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేసారు. ప్రైవేటు సంస్థలలో పనిచేస్తున్నవారు తప్పనిసరిగా గుర్తింపు కార్డులను తమ వెంట ఉంచుకోవాలన్నారు.. 2వ దశ కోవిడ్ నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూను పటిష్టంగా అమలు పరుస్తూ కోవిడ్ నిబంధనలుపాటించని వారిపై ఇప్పటికే 826 కేసులను నమోదు చేసామన్నారు.

అదే విధంగా, కర్ఫ్యూ సమయంలో రాత్రిపూట అనవసరం గా బయట తిరుగుతున్న వారిపై 15వేలు కేసులు నమోదు చేసి,  51 లక్షలను ఈ-చలానాలు విధించి, 92 వాహనాలనుసీజ్ చేసామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా ఉద్దేశ్యపూర్వకంగా తిరుగుతూ, కరోనా వ్యాధి వ్యాప్తికి కారకుల వుతున్న వారిపై ల‌క్షా 41,625 కేసులు నమోదు చేసి, కోటి,ప‌ద్నాలుగు ల‌క్ష‌ల ,78,630 సొమ్ముతో ఈ-చలానాలు విదించామ‌న్నారు..

జిల్లా ఎస్పీ వెంట ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, స్పెషల్ బ్రాంచ్  సీఐ జి.రాంబాబు, విజయనగరం 2వ పట్టణ సీఐ లక్ష్మణరావు, ఎస్ఐలు దుర్గా ప్రసాద్, బాలాజీరావు, సూర్యనారాయణ, భాస్కరరావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Related posts

ఏపీలో స్థానిక సంస్థల నోటిఫికేషన్‌ విడుదల

Satyam NEWS

హైదరాబాద్ కు ధీటుగా ఖమ్మం అభివృద్ధి

Bhavani

కాకినాడ ఆర్టీసి కాంప్లెక్స్ లో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment