38.2 C
Hyderabad
April 29, 2024 11: 35 AM
Slider ముఖ్యంశాలు

పునశ్చరణ శిక్షణలో ప్రతిభ కనబర్చిన పోలీసు జాగిలం డైనా

#vijayanagaramSP

విజయనగరం జిల్లా పోలీసు శాఖకు చెందిన స్నిఫర్ డాగ్ డైనా గుంటూరు జిల్లా మంగళగిరిలో 15రోజులపాటు జరిగిన పునశ్చరణ శిక్షణలో ప్రతిభ కనబర్చి, రెండో స్థానం సాధించినట్లుగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక  తెలిపారు.

జిల్లా పోలీసుశాఖకు చెందిన స్నిఫర్ డాగ్ డైనా ఇంటెలిజెన్సు సెక్యూరిటీ వింగ్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని రాష్ట్ర ప్రధాన కేంద్రంలో ఈ నెల 1 నుండి 15 వరకు 15రోజుల పునశ్చరణ శిక్షణ పూర్తి చేసుకుంది.

రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, రైల్వే మరియు ఇతర విభాగాలకు చెందిన పోలీసు డాగ్స్ కు కూడా శిక్షణకు వచ్చాయి. శిక్షణలో డాగ్స్ కు వివిధ పరీక్షలు నిర్వహించగా జిల్లాకు చెందిన స్నిఫర్ డాగ్ డైనా అన్ని విభాగాల్లోను మంచి ప్రతిభ కనబర్చి, ద్వితీయ స్థానంలో నిలిచింది.

శిక్షణలో ప్రతిభ కనబర్చిన డాగ్ డైనా, హేండలర్ వై.ప్రేమ్ కుమార్‌ను జిల్లా ఎస్పీని జిల్లా పోలీసు కార్యాలయంలో కలవగా, జిల్లా ఎస్పీ ఎం. దీపిక డాగ్ డైనా, హేండలర్ ప్రేమ్ కుమార్‌ను అభినందించి, ప్రశంసా పత్రంను అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ టి.వి.ఆర్.కే.కుమార్, ఆర్ఎస్ఐ రమేష్ లు పాల్గొన్నారు.

Related posts

బివిఆర్ బ్యానర్ ‘భారీ తారాగణం’ ప్రారంభం!

Sub Editor

వనపర్తికి వన్నె తెచ్చిన బిసి నేతలకు తీరని అవమానం

Satyam NEWS

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు రిమాండ్

Satyam NEWS

Leave a Comment