33.7 C
Hyderabad
April 28, 2024 23: 43 PM
Slider విజయనగరం

అక్కడ ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న విధేంటో తెలిస్తే..అవాక్కే…

#trafficpolice

నియమ బధంగా ఎక్కడైనా ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తారంటే…ఏం చెబుతారు..?ట్రాఫిక్ రెగ్యులర్ చేయడంతో పాటు… నిమయనిబంధనలకు విరుద్ధంగా ఏ వాహనం అయినా రోడ్ మీద కనిపిస్తే వెంటనే ఆపి ఈ-చలానా విధిస్తారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు విరుద్ధంగా ఎవ్వరైనా వెళితే.. బైక్ సీజ్ చేస్తారు.

కానీ విజయనగరం ట్రాఫిక్ పోలీసులు మాత్రం రూల్స్ అతిక్రమించిన వారిని కని పెట్టడంతో రోడ్ల పై వాహనాలు సులభతరంగా వెళ్లేందుకు అడ్డంగా ఉన్న వాటిని కూడా ట్రాఫిక్ పోలీసులే తొలగించే పనిలో పడుతున్నారు. ఏడాదిన్నర క్రితం నగరంలో కలెక్టరేట్ జంక్షన్ వద్ద అర్థరాత్రి… ఓ పెట్రోల్ వాహనానికి తృటిలో ప్రమాదం తప్పించిన ఇదే ట్రాఫిక్ పోలీసులు… ట్రాఫిక్ ను డీఎస్పీ ఆదేశాలు, సూచనలతో క్రమబద్ధీకరణ చేసి.శభాష్ ట్రాఫిక్ పోలీసు అని అనిపించుకున్నారు.

తాజాగా నగరంలో ఎత్తు బ్రిడ్జి వద్ద విశాఖ నుంచీ గజపతి నగరం వైపు వెళ్లే రహదారి లో రోడ్ పై కంకర లోడు వెళుతున్న వాహనం కాస్త ప్రమాదానికి గురవడంతో రోడ్ అంతా కంకర పడి వచ్చే పోయే వాహనాలకు ఇబ్బంది గా మారింది. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హెచ్ సి హరి.. సకాలంలో స్పందించి..స్వయంగా చీపురు పట్టుకుని కంకర మొత్తం నడుం వొంచి ఓ స్వీపర్ అవతారం ఎత్తారు. దీంతో అటు వెళ్లే జనాలు, వాహనదారులు… ఔరా….అంటూ నోరెళ్లబెట్టి…ట్రాఫిక్ పోలీసులు పనితీరు కు హేట్సాఫ్ చెబుతున్నారు.

Related posts

ఆంధ్ర అధికారులతో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్

Satyam NEWS

సకాలంలో ఫిర్యాదు చేస్తే సైబరు నేరాలను ఛేదించవచ్చు

Satyam NEWS

సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుటకు రామ్ గోపాల్ వర్మ

Satyam NEWS

Leave a Comment