29.7 C
Hyderabad
April 29, 2024 07: 50 AM
Slider విజయనగరం

ర‌య్..ర‌య్ మంటూ బైక్ లపై కుర్రవాళ్లు: ఈ-చ‌లానాల‌తో ట్రాఫిక్ పోలీసులు…!

#vijayanagaram

క‌రోనాపుణ్య‌మా గ‌డ‌చిన రెండేళ్లుగా…అటు ట్రాఫిక్ పోలీసులు నియ‌మ‌నిబంధ‌న‌ల‌పై అంత‌గా దృష్టి పెట్ట‌క‌పోవ‌డం…ఇటు ప్ర‌జ‌లు అందునా వాహ‌న‌దారులు కూడా హెల్మెట్లు,సీ బుక్ ,లైసెన్స్ వంటివి పెట్టుకోవడం చాలా వ‌ర‌కు మ‌ర‌చిపోయారు. అయితే ఇటీవ‌లే అటు ఆర్టీఏ ఇటు, పోలీస్ శాఖలు మ‌ళ్లీ హ‌ల్మెట్ వాడ‌కం…స్పీడ్ డ్రైవింగ్ వంటిపై  దృష్టి పెట్టింది. ఇటీవ‌లే హెల్మెట్ లేకుండా బైక్ ల పై వెళుతున్న వారికి వెయ్యి రూపాయ‌లు జ‌రీనామా విధించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలివ్వ‌డంతో…ఆర్టీఏ, ఏఆర్  సిబ్బంది రంగంలోకి దిగారు.

వీటిని దృష్టిలో పెట్టుకుని  స‌త్యం న్యూస్.నెట్. తాజాగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌తో. వాహ‌నాలు న‌డిపే వారికి  క‌న్నా..వాళ్లు క‌న్న‌వారికి    కొన్ని విష‌యాల‌ను  చెప్పే య‌త్నం చేస్తోంది.పిల్ల‌ల‌ని క‌న్న తల్లిదండ్రులూ…..మీకే చెబుతున్నాము…మీ పిల్ల‌లు బైక్ మీద‌ ఇంటి  వెళితే…అబ్బో మా పిల్లాడు బైక్ నేర్చేసుకున్నాడు…అని సంబ‌ర ప‌డిపోకండి…బండి తాలూక సీ బుక్, డ్రైవింగ్ లైసెన్స్ తో  పాటు క‌నీస జ్ఙానం కూడా ఇచ్చి పంపండి.రోడ్డు మీద మీ పిల్ల‌ల‌న్ని ప‌రిశీలిస్తూ …ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన వారిపై  అనుక్ష‌ణం ప్ర‌తీ చోట సీసీకెమారాలు అన్న ఓ  మూడో క‌న్న ఒక‌టి ఉంటోంద‌ని గ్ర‌హించండి.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే…రోడ్ పై ట్రాఫిక్ పోలీసు అబ్ద‌దం చెప్పినా…తోటి  స్నేహితులు  త‌ప్పు మాట్లాడినా…న‌డిరోడ్డుపై  ఏదో మూల‌న ఉన్న సీసీ కెమారా మాత్రం నిజం చెబుతుంది. ఎందుకంటే  త‌మ రోజు వారి విధుల‌లో ట్రాఫిక్ పోలీసుల‌నే ఠ‌లాంచి ఓ య‌వ‌కుడు బైక్ పై ఓ ట్రాఫిక్ ఎస్ఐ నే ఢీ కొట్టబోయాడు. అంతే  ఇక చేతిలో సెల్ ఫోన్ అందుకుని త‌న‌ను ఆపినందుకు గాను…  కాపాడాలంటూ ఫోన్ చేసిన ఘ‌ట‌న చోటు చేసుకుంది..

ఏపీలోని విద్య‌ల న‌గ‌రంగా భాసిల్లిన విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలోని మూడు లాంత‌ర్ల వ‌ద్ద రోజులానే ట్రాఫిక్ పోలీసులు…ఎస్పీ ఆదేశాలు…ట్రాపిక్ డీఎస్పీ సూచ‌న‌ల‌తో  బైక్ ల‌ను ఆపు చేసి…త‌నిఖీలు చేప‌ట్ట‌సాగారు. ట్రాఫిక్ ఎస్ లు భాస్క‌ర‌రావు, దామోద‌ర రావు లు ఇద్ద‌రూ ఒకేసారి మూడు లాంత‌ర్ల వ‌ద్ద త‌నిఖీలు నిర్వహించ‌సాగారు.కాస్సేప‌టికి  ఎస్ఐ దామోద‌ర‌రావు నీళ్ల  ట్యాంక్ వైపు వెళ్లిపోగా… ఎస్ఐ  భాస్క‌ర‌రావు మూడు లాంత‌ర్ల వ‌ద్దే  ట్రాఫిక్ హెచ్.సీ త్రినాధ్ రావుతో బైక్ ల‌ను ఆపు చేసిన త‌నిఖీలు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఓ బైక్ ను న‌డుపుతున్న కుర్రాడు..జంక్ష‌న్ లో ట్రాఫిక్ పోలీసుల‌ను చూసి ర‌య్యూ మంటూ వాళ్ల‌ను దాటుకెళ్లే య‌త్నం చేసాడు. అక్క‌డే  ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ భాస్క‌ర‌రావు  ఆ బైక్ నుఆపేందుకు ముందుకురావ‌డంతో ఎస్ఐ నే ఢీ కొట్ట‌బోయి వెళ్లిపోబోయాడు.

వెంట‌నే ఎస్ఐ ..హెచ్.సీలు ప‌రగెత్తి బైక్ ను అడ్డుకోవ‌డంతో..లైసెన్స్ లేక‌,హెల్మెట్ లేక‌, సీ బుక్ లేక‌పోవ‌డంతో..అక్క‌డిక్క‌డే బైక్ ను స్టేష‌న్ ను త‌ర‌లించారు..ట్రాఫిక్ పోలీసులు.ఏదైనా..గ‌డ‌చిన రెండేళ్లు క‌రోనా పుణ్య‌మా..ట్రాఫిక్ నిబంద‌న‌ల‌ను అంత గా అమ‌లు చేయ‌క‌పోవ‌డంతో…ప్ర‌స్తుతం…అటు వాహ‌న‌దారుల్లోనూ ఇటు పోలీసులులోనూ కాస్త  మెత‌క వైఖ‌రే  ఉంటోందని అని అంటోంది. స‌త్యం  న్యూస్.నెట్.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

Over The Counter – 2018 Top Cbd Hemp Quote Picture Fb Hemp Bombsl Cbd Gummies Cbd Hemp Oil Canada Buy

Bhavani

హుజూర్ నగర్ లో సోనియా గాంధీ పుట్టిన రోజు పండుగ

Satyam NEWS

రిటైర్ అయిన పోలీసుకు ఆత్మీయ వీడ్కోలు

Satyam NEWS

Leave a Comment