29.7 C
Hyderabad
April 29, 2024 08: 38 AM
Slider ప్రత్యేకం

సీనియర్ జర్నలిస్టు విద్యారణ్య కామ్లేకర్ ఆకస్మిక మృతి

#vidyaranya

గత మూడు దశాబ్దాలుగా తెలుగు పత్రికా రంగంలో ఎనలేని సేవలు చేసిన జర్నలిస్టు విద్యారణ్య కామ్లేకర్ అకస్మాత్తుగా మరణించారు. సీనియర్ జర్నలిస్ట్ విద్యారణ్య గుండెపోటుతో మరణించారు. కేర్ హాస్పిటల్ లో చేర్పించగా మ్యాసివ్ హార్ట్ అటాక్ తో కాలం చేసారు.

ఏడాది క్రితం విద్యారణ్య కు గుండెలో స్టంట్లు వేసారు. ప్రస్తుతం ఆయన సకాల్ దినపత్రికలో పని చేస్తున్నారు. ఆంధ్రప్రభ, హింది మిలాప్ లాంటి పత్రికల్లో ఆయన జర్నలిస్టుగా దశాబ్దాల కాలంగా ఆయన పని చేశారు. విద్యారణ్య మృతిపట్ల భారత ఉప రాష్ట్ర పతి ఎం.వెంకయ్యనాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ఆయన మరణం జర్నలిజానికి తీరని లోటని ఆయన అన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ జర్నలిస్టు విద్యారణ్య మృతిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జాతీయ భావజాలం, క్రమశిక్షణ, సేవా కార్యక్రమాలు వారి నిత్య జీవనంలో ఒక భాగం. ఆప్యాయతకు, మంచితనానికి మారుపేరు. సమాజ శ్రేయస్సు కోసం తన కలం ద్వారా ప్రపంచానికి చాటిన వ్యక్తి. వారి మరణం పత్రికా రంగానికి తీరని లోట అని దత్తాత్రేయ అన్నారు.

విద్యారణ్య మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు దత్తాత్రేయ తెలిపారు.

Related posts

ధరణి సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ దీక్ష

Satyam NEWS

దళితులపై ప్రభుత్వం పక్షపాత వైఖరి వీడాలి

Satyam NEWS

వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా గోపాష్ట‌మి‌

Satyam NEWS

Leave a Comment