Slider విశాఖపట్నం

రిక్వెస్టు: కరోనా డొనేషన్లు ఇంకా విరివిగా ఇవ్వాలి

vijayasaireddy 161

కోవిడ్ 19 నియంత్రణకు అధికారయంత్రాంగం అద్బుతంగా  పనిచేస్తోందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి అన్నారు. పోలీసు, రెవిన్యూ, పారిశుధ్యయంత్రాగం చాలా బాగా  పనిచేస్తున్నారుని, పోలీసు డిపార్ట్ మెంట్ పై కూడా చాలా పాజిటివ్ స్పందన కనిపిస్తోంది ఇది అభినందించదగ్గ విషయమని ఆయన అన్నారు.

సిఎం రిలీఫ్ ఫండ్ కోసం పలువురు వ్యక్తులు జిల్లా కలెక్టర్ కు 2.74 కోట్ల రూపాయలు హ్యాండోవర్ చేశారని, కోవిడ్ 19 ఫండ్ కు విశాఖపట్నం పరిశ్రమల నుంచి 4.24 కోట్ల రూపాయలను ఇచ్చారని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో దాదాపు 2 లక్షల బిపిఎల్ కుటుంబాలు ఉన్నాయని, ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 750 రూపాయల విలువైన నిత్యావసరాల వస్తువులతో కూడిన కిట్ అందించాలని భావిస్తున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు.

ఇందుకోసం 15 కోట్ల రూపాయలు అవసరమవుతాయని భావిస్తున్నాం. జివిఎంసి కమీషనర్ పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ చేసి దానికి లిబరల్ గా సహాయం చేయండి. రెడ్ జోన్ లో గాని, కంటైన్ మెంట్ ఏరియాలో గాని ఉన్నవారిలో ఎవరికైతే అవసరాలు ఉన్నాయో వారికి సహాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన అన్నారు.

విశాఖలో పది ప్రాంతాలలో వాకింగ్ డిస్ ఇన్ ఫెక్షన్ ఛాంబర్స్ ఏర్పాటుచేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. దానికి డోనార్స్ కూడా ముందుకు వచ్చారు.

అది కూడా నాలుగైదు రోజులలో జిల్లా కలెక్టర్, జివిఎంసి ఆద్వర్యంలో  ఏర్పాటు చేస్తారు. జిల్లా రెడ్ క్రాస్ వాళ్లు మా దగ్గర బ్లడ్ లేదు. బ్లడ్  డోనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

Related posts

కరోనా రూల్స్ బ్రేక్: రాజకీయ పార్టీలకు హైకోర్టు నోటీసులు

Satyam NEWS

వనపర్తిలో 2 కోట్లతో నిర్మించిన ఎస్పీ నివాస గృహాన్ని ప్రారంభించిన మంత్రి

Satyam NEWS

స్టోరీ కంటిన్యూస్: నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అర్హత లేదు

Satyam NEWS

Leave a Comment