వనపర్తిలో ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట శివారులో నూతనంగా నిర్మించిన వనపర్తి జిల్లా ఎస్పీ నివాస గృహాన్ని, క్యాంపు కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, వనపర్తి జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎస్పీ నివాస గృహానికి భూమిని కేటాయించి నిర్మాణం గురించి ప్రభుత్వం తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా 2 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా నూతన సాంకేతికతతో నివాస గృహాన్ని రెండు ఫ్లోర్ లు నిర్మించారని తెలిపారు.
రానున్న శతాబ్దకాలానికి ఉపయోగపడేలా కొత్తగా నిర్మించే పోలీసు పరిపాలనా సంబంధిత భవనాలు ఉండాలన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అభిలాష అని తెలిపారు. ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగానే నివాస భవనాలను రాష్ట్రంలోని అన్ని కమీషనరేట్ లు, జిల్లాలలో నిర్మించాలని ముఖ్యమంత్రి చేసిన ఆదేశాల మేరకు వీటి నిర్మాణం చేపట్టేందుకు రూపొందించింది నిర్మించారని అన్నారు.
వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయ భవనం సమీపంలో నిర్మించిన ఎస్పీ నివాస గృహం అత్యంత ఆధునిక ప్రమాణాలతో నూతన హంగులతో నిర్మించారని తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయం వెనక భాగంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు నివాసం ఉండేందుకు అధునాతన భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి షాకీర్ హుస్సేన్, వనపర్తి డిఎస్పీ, కెఎం,కిరణ్ కుమార్,పోలీసు కార్యాలయం ఏ ఓ, రుక్మిణిబాయి, పోలీసు హౌసింగ్ డిఇ.బాలాజీ దాసు, పోలీసు హౌసింగ్ ఏఈ, అనిల్ శాస్త్రి, వనపర్తి సిఐ, ప్రవీణ్ కుమార్, కొత్తకోట సీఐ, మల్లికార్జున్ రెడ్డి, ఆత్మకూరు సిఐ, సీతయ్య, సాయుధ దళాల ఇన్స్పెక్టర్ జగన్, పట్టణ ఎస్సై, మధుసూదన్, 2వఎస్సై, మల్లేష్, వనపర్తిరూరల్ ఎస్సై, షేక్ షఫీ, పెద్దమందడి ఎస్సై, సిహెచ్. రాజు, ఖిల్లాగణపురంఎస్సై, వెంకటేష్ గౌడ్, కొత్తకోట ఎస్సై నాగశేఖర్ రెడ్డి, గోపాల్పేట ఎస్సై, రామన్ గౌడ్, పెబ్బేరు ఎస్సై, రామస్వామి, పానగల్ ఎస్సై, నాగన్న, వీపనగండ్ల ఎస్సై, రాము, ఎస్పీ పిఆర్ఓ, రాజాగౌడ్, పోలీసు సిబ్బంది , ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్