33.7 C
Hyderabad
April 29, 2024 02: 07 AM
Slider పశ్చిమగోదావరి

గ్రామ సహాయకుల వేతనం 21 వేలకు పెంచాలి

#revenuesecretaries

గ్రామ సహాయకులు వేతనం 21వేల రూపాయలకు పెంచాలని పశ్చిమగోదావరి జిల్లా రెవిన్యూ గ్రామ సహాయకుల సమావేశం డిమాండ్ చేసింది.

ఏలూరులో మంగళవారంనాడు పశ్చిమగోదావరి జిల్లా రెవిన్యూ గ్రామ సహాయకుల అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రెవిన్యూ గ్రామ సహాయకుల అధ్యక్షులు బి గణేశ్వరరావు, జిల్లా రెవిన్యూ అధ్యక్షులు ఎల్ వి సాగర్ అధ్యక్షత వహించారు.

అర్హులైన వి ఆర్ ఏ లను గ్రేడ్2 వి ఆర్ ఓ లుగా పదోన్నతులు కల్పించాలని, అదేవిధంగా జిల్లాలో ఖాళీగా ఉన్న సబార్డినెట్ పోస్టుల్లోనూ డ్రైవర్ ఉద్యోగాలను నైట్ వాచ్ మెన్ లుగాను అటెండర్ వంటి ఉద్యోగాల భర్తీలో వి ఆర్ ఏ ల తో భర్తీ చేయాలని కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కు, జె సి కి, మంత్రి తానేటి వనితకు వి ఆర్ ఏ ల అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వి ఆర్ ఏ ల అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డి ఎన్. వి డి ప్రసాద్, తాడిగడప గంగాధర్, పండు, బ్రహ్మాజీ, పోసిబాబు, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నాడూ నేడూ అన్నారు… ఏడా కనపడదేం మార్పు….?

Satyam NEWS

తృటిలో తప్పించుకున్న టాప్ మావోయిస్టులు

Satyam NEWS

చిన్న మధ్య తరహా దినపత్రికల డైరీ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment