32.2 C
Hyderabad
May 8, 2024 22: 37 PM
Slider నిజామాబాద్

ఇసుక రవాణాను అడ్డుకున్న కథగా౦ గ్రామస్తులు

#Sand Mafia

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని ఖత్గ౦ మంజీర పరివాహక ప్రాంతం  నుండి  తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇసుక తరలింపునకు అనుమతులు జారి కాగా  వారు ఆదివారం ఉదయం ఇసుక తరలిస్తుండడంతో మంజీర పరివాహక ప్రాంతాల రైతులు ఇసుక రవాణాను అడ్డుకున్నారు.

దీంతో రెవెన్యూ పోలీసు అధికారులు అక్కడికి చేరుకోవడంతో కొద్దిసేపు వాగ్వాదం చోటు  చేసుకుంది. మంజీరాలో ఇసుక తవ్వేస్తే భూగర్భజలాలు అడుగంటిపోయి ప్రమాదం ఉందని దీని వలన తమ పంట చేలలో బోరుమోటార్లు పని చేయవని రైతులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కానీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇసుక రవాణా తప్పదని అధికారులు స్పష్టం చేయడంతో ఖతగా౦ గ్రామ పంచాయతీ నుండి ఇసుక రవాణా చేయరాదంటూ తీర్మానం చేసి అధికారులకు ప్రతులను అందజేశారు.

దీంతో అధికారులు వెనుదిరిగారు. ఏ రాత్రి ఇసుక రవాణా చేసినా తాము అడ్డుకుంటామని తమ పొట్ట కొట్టే పని తెలంగాణ ప్రభుత్వం చేయరాదంటూ రైతులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.

Related posts

ఏకగ్రీవాలను ఆమోదించాలని హైకోర్టు ఆదేశం

Satyam NEWS

ఓ భగీరథా ఒక్క సారి మావూరు వచ్చిపోవా

Satyam NEWS

పిచ్చికుక్కలా బైరి నరేష్ వ్యాఖ్యలు

Satyam NEWS

Leave a Comment