37.2 C
Hyderabad
May 2, 2024 13: 55 PM
Slider ఆదిలాబాద్

నిదర మత్తులో ఎక్సైజు: మద్యం మత్తులో గ్రామాలు

liquir bottls

మద్యం ఆదాయం విపరీతంగా పెరిగిపోతున్నదని ప్రభుత్వ పెద్దలు సంతోషపడుతున్నారు. మద్యం తాగితే కిక్కెక్కుతుందని జనం సంతోష పడుతున్నారు. ఈ ఇద్దరి కన్నా మద్యం షాపు నిర్వాహకులు ఎక్కువ సంతోషపడుతున్నారు.

మద్యం షాపు నిర్వాహకుల సంతోషం అటు ప్రభుత్వానికి, ఇటు మద్యప్రియుల జేబుకు బొక్కపెడుతున్నది. ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండల కేంద్రం లోని  వైన్స్ షాప్ లో ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికరేట్లు  వసులు చేస్తున్నారు.

ఈ వేసవిలో గ్రామాల్లో మంచినీటి సదుపాయాలు లేవు గాని ఏ గ్రామాల్లో వెళ్లినా మద్యం మాత్రం ఏరులై పారుతుంది. గ్రామాల్లో పట్టణాల్లో ఉండాల్సిన మద్యం దుకాణాలు నేడు పల్లెల్లో గల్లీకొకటి వెలుస్తున్నాయి. మద్యం విక్రేతలు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు.

ఉదయం నుంచి రాత్రి వరకు బెల్టుషాపులతో మద్యం ఏరులై పారుతోంది. ATM లో డబ్బులుంటాయో లేదో గాని గ్రామాల్లో మాత్రం ఎనీ టైం మద్యం దొరుకుతుంది. నూతన ఎక్సైజ్‌ మద్యం పాలసీని తీసుకువచ్చి ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించేలా, కల్తీ మద్యాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో బెల్టుషాపు నిర్వాహకులకు హద్దు లేకుండా పోతుంది.

దీంతో వారి వ్యాపారం మూడు క్వాటర్లు, ఆరు బీర్లుగా కొనసాగుతోంది. మండంలో దాదాపుగా అన్ని గ్రామాల్లో ఐదు నుంచి పది వరకు బెల్టు షాపులు నిర్వహణ కొనసాగుతుందంటే ఎక్సైజ్‌ అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

గ్రామాల్లోని కూలీ పనులు చేసుకునే నిరుపేదలు బెల్టుషాపులకు అలవాటుపడి కూలీ పనులకు సైతం పోకుండా నిత్యం గ్రామాల్లో మద్యం మత్తులో ఉంటున్నారు. దరోగపల్లి నుంచి మురలిగూడా  వరకు మద్యం సరఫరా జరుగుతుందని బహిరంగ రహస్యం గా చెప్పవచ్చు.

మండల కేంద్రంలో ఉన్న మద్యం షాప్ నుంచి కొనుగోలు చేసి గ్రామాలకు తీసుకువెళ్లి మరీ ఒక మద్యం బాటిల్‌పై ఎంఆర్‌పీ రేటు కంటే రూ.20 వరకు అదనంగా బహిరంగంగా వసూలు చేస్తున్నారు. మద్యం అమ్మకందారులు సిండికేట్‌గా మారడంతో బెల్టుషాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి.

మద్యం షాపుల టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు లాభార్జనే ధ్యేయంగా గ్రామీణ ప్రాంతాల వారికి విక్రయిస్తున్నారు. మద్యం షాపులను రహదారుల పక్కన నిర్వహించరాదని అధికారికంగా చెప్పినా గ్రామాల్లో రోడ్ల పక్కనే దర్జాగా మద్యం విక్రయిస్తున్నా సంబంధిత ఎక్సైజ్‌ అధికారులు మామూళ్ల మత్తులో ఉండి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.

మద్యానికి బానిసైన వారు అనారోగ్యం పాలవడంతో పాటు కుటుంబాలు అప్పుల కొరల్లో చిక్కుకోవడం, గొడవలు వంటి సంఘటనలు చోటు  చేసుకున్నాయి. కొన్ని నెలల క్రితమే మండల కేంద్రంలో సరిగ్గా ఇరవై సంవత్సరాలు నిండని ఒక అబ్బాయి మద్యానికి బానిసై చనిపోయాడు.

మధునయ్యా అనే వ్యక్తి తాగుడుకు బానిసై చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మండల కేంద్రంలో ఇంకో వ్యక్తి తాగుడుకు బానిసై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దరోగపల్లి గ్రామం లో కొన్ని నెలల క్రితం జరిగిన మర్డర్ కూడా తప్ప తాగి మతిస్థిమితం కోల్పోయి చేసినట్టు స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.

 గ్రామాల్లో బెల్టుషాపులను నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు, ఎక్సైజ్ డిపార్ట్ మెంట్  అధికారులు అంటున్నారు. ఇప్పటికే మండలంలోని పలు గ్రామాల్లో తనిఖీలు చేపట్టి నిర్వాహకులపై కేసులు నమోదు చేశామని, కొంతమంది కి కౌన్సెలింగ్ ఇచ్చామని అంటున్నారు.

గ్రామాల్లో మద్యం విక్రయాలను నివారించేందుకు నిరంతర తనిఖీలు చేస్తూనే ఉన్నాం. గ్రామాల్లో ఎవరైన మద్యం విక్రయిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు అంటున్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు.

మద్యం మత్తులో ఉన్న వాళ్ళ వల్ల రోడ్డుపై తిరగాలంటే భయంగా ఉన్నదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెల్టుషాపుల నిర్వాహకులపై, అధిక ధరలకు అమ్మే మద్యం షాపులపై ఎక్సైజ్‌ అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మహిళలు, గ్రామస్తులు కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఖజానా నిండాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఎక్సయిజ్ శాఖ పై ఒత్తిడితో చూసి చూడనట్లు, నెల నెలా మామూళ్ల మత్తులో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న ఎక్సైజ్ అధికారులు ఎవరైనా ప్రజలు ఫిర్యాదు చేస్తే కార్డన్ సర్చ్ చేసినా ముందస్తుగా సమాచారం వారికే అందుతుండటం తో నామమాత్రంగా తనికీలు చేసి తూ తూ మంత్రంగా వ్యవహారం సాగుతోంది.

Related posts

పేద బ్రాహ్మణ కుటుంబాన్ని ఆదుకున్న మానవతామూర్తులు

Satyam NEWS

గ్రేటర్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సభ్యత్వానికి విశేష స్పందన

Satyam NEWS

వైకుంఠద్వారం 10 రోజులు తెరవడం శాస్త్రవిరుద్ధం

Satyam NEWS

Leave a Comment