42.2 C
Hyderabad
April 26, 2024 17: 09 PM
Slider కరీంనగర్

గ్రాండ్ సెర్మనీ:వేములవాడ లో నేత్ర పర్వంగా శివకళ్యాణం

shiva kalyanam

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణం తిలకించేందుకు రాష్ట్రం నలుమూల నుండి భక్తులు తరలివచ్చారు. ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకదాశ రుద్రాభిషేకంతో దేవత ధ్వజారోహణాహవనం,తో కళ్యాణ ఘట్టం ప్రారంభించారు.

అర్చకులు. వరుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని, వధువు పార్వతి దేవిని వేదమంత్రాలు, మేళతాళాల మధ్య ఘనంగా ఎదుర్కొన్నారు. అభిజిత్ లగ్న ముహూర్తంలో కళ్యాణ మహోత్సవం జరిగింది.స్థానాచార్యులు భీమశంకర శర్మ ఇందిరా దంపతులు కన్యాదాతలు గా వ్యవహరించారు.

శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శివ కళ్యాణ మహోత్సవాలలో భాగంగా, స్వామి వారికి మున్సిపల్ పాలకవర్గం పట్టువస్త్రాలను సమర్పించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి పట్టువస్త్రాలు సమర్పించారు‌. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు , కమిషనర్ పాల్గొన్నారు. శివ కళ్యాణ మహోత్సవాలలో రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ న్యాలకొండ అరుణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు అప్పాల భీమశంకర్, ఈవో కృష్ణవేణి, మున్సిపల్ ఛైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, పలువురు కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో గురువారం జరిగే శివ కళ్యాణ మహోత్సవాన్ని చూసి తిలకించేందుకు రాజన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు అన్నీ శివ నామస్మరణతో మార్మోగాయి. పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి.

కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి భక్తులు కట్నాల రూపం లో స్వామి వారికి కానుకలు సమర్పించారు.అనంతరం తలంబ్రాలు పడటం తో తమ ఆరోగ్యం బాగుపడుతుందని విశ్వాసం తో వారి వారి గ్రామాలకు తిరుగు ప్రయాణమయ్యారు.ఈ కార్య క్రమానికి శివపార్వతులు,జోగినులు,హిజ్రాలు హాజరవడం విశేషం.


వివాహ వేడుకలో భాగంగా జరిగిన ‘ఎదురుకొల్లు’ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి కె.కృ ష్ణవేణితో పాటు వేములవాడ పట్టణ పంచాయతీ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి రాజులతో పాటు బీజేపీ నాయకులూ ప్రతాప రామకృష్ణ లు కట్నం గా గతం కంటే ఎక్కువగా ఆదాయం రూపం లో ఉండాలని కోరుతూ పెళ్లి తంతు నిర్వహించడం అందరిని ఆకర్షించింది.స్థానిక డిఎస్పీ నేతృత్వం లో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Related posts

భవిష్యత్తు తరాల కోసం వైఎస్ షర్మిల కు అండగా ఉందాం

Satyam NEWS

అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ పై రష్యా క్షిపణిదాడి

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్ లో బార్ లపై కరోనా ట్యాక్స్

Satyam NEWS

Leave a Comment