33.7 C
Hyderabad
April 30, 2024 02: 07 AM
Slider నిజామాబాద్

అభాగ్యులకు అండగా దేవాడ గ్రామస్తులు

villegers

బిచ్కుంద మండలంలోని పెద్దదేవాడ గ్రామంలో  నిరుపేద  పేద కుటుంబాలకు దాతల సహకారంతో నిత్యావసర సరుకులైన బియ్యం పప్పు కూరగాయలను ఎంపిపి అశోక్ పటేల్  చేతులు మీదుగా సోమవారం  అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నాయని కావున ప్రజలందరూ ప్రభుత్వ చర్యలకు సహకరించి ఇంటి నుండి బయటకు రాకుండా ఉండాలన్నారు.

నిరాశ్రయులకు నిరుపేదలకు గుర్తించి తమ వంతు సహకారం అందించాలని ఆయన సూచించారు. ఎవ్వరూ ఆకలితో అలమటించకుండా ఉండేలా చూసే బాధ్యత ప్రతి ఒక్కరిదని దేవాడలో ఇటువంటి మహత్తర కార్యక్రమం చేపట్టడం పట్ల ఆయన సర్పంచ్ను అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎంపికతో పాటు సర్పంచ్ జె శివ నందప్ప మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, తహసీల్దార్ వెంకట్రావు, మార్కెట్ కమిటీ  వైస్ చైర్మన్ మల్లికార్జున్, సొసైటీ డైరెక్టర్ నరసింహాచారి, గ్రామ రెవెన్యూ అధికారి పండరి,  పంచాయితీ సెక్రెటరీ శ్రీనివాస్, అంగన్వాడి ఆరోగ్య కార్యకర్తలు గ్రామ పంచాయతీ సిబ్బంది నిరుపేద కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

పొగాకు ఉత్పత్తుల ప్రచారం నేరం

Satyam NEWS

ప్రతి పెట్రోల్ బంకులో సిసి కెమెరాలు పెట్టాలి

Satyam NEWS

అత్యాచారయత్నం కేసులో నిందితుడికి 5 ఏల్ల జైలు శిక్ష

Bhavani

Leave a Comment