40.2 C
Hyderabad
April 26, 2024 13: 35 PM
Slider శ్రీకాకుళం

బడిబయట విద్యార్థులను గుర్తిస్తున్న సమగ్ర శిక్ష ఒప్పంద అధ్యాపకులు

#School Enrolment

బడి బయట ఉన్న విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించే కార్యక్రమాన్ని శ్రీకాకుళం సమగ్ర శిక్ష  ప్రభుత్వ పాఠశాల ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయులు, సి. ఆర్ . పి . లు చేపట్టారు.

దీనిలో భాగంగా గురువారం ఉదయం శ్రీకాకుళం గ్రామీణ మండలంలో బడి మానేసి విద్యార్థుల వివరాలను సేకరించి తిరిగి వారిని తిరిగి బడిలో చేర్పిస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం మండలం విద్యాశాఖాధికారి జీ. కృష్ణారావు పర్యవేక్షిస్తున్నారు.

సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న వ్యాయామ వ్యాయామ ఉపాధ్యాయులు జి మోహన్, కె నరేష్, ఆర్ట్ , క్రాఫ్ట్, ఉపాధ్యాయులు సిహెచ్.రవి కుమార్, బీ త్రివేణి, పద్మావతి, శ్రీకాకుళం గ్రామీణ  మండలంలో పాత్రునివలస  స్కూల్ కాంప్లెక్స్ లో సి ఆర్ పి గా పనిచేస్తున్న పి.మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎమ్మెల్యేకు రాఖీ కట్టిన జడ్పిటిసి సభ్యురాలు

Satyam NEWS

విద్య, వైద్యం కోసం రాచాల భరోసా యాత్ర

Satyam NEWS

ప్రపంచంలోనే అతి పెద్ద అమేజాన్ సెంటర్ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment