38.2 C
Hyderabad
April 28, 2024 20: 19 PM
Slider కర్నూలు

మంత్రాలయం వచ్చిన శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానదేంద్ర సరస్వతి

#mantralayam

స్వధర్మ వాహిని ప్రచార యాత్రలో భాగంగా శ్రీ విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానదేంద్ర సరస్వతి కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకోనేందుకు విచ్చేశారు. ఆయనకు శ్రీ మఠం అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభం స్వాగతం పలికారు. ఆయన ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని అనంతరం శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామిజీ ఫల పుష్ప మంత్రాక్చతలు ఇచ్చి ఆశీర్వాదించారు. స్వాత్మానదేంద్ర సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ మంత్రాలయం పీఠంకు, విశాఖ శారదా పీఠంకు ఆవినాభ సంబంధం ఉంది. శ్రీకృష్ణడుకు అతని స్నేహితుడు అర్జునుడుకు ఉన్న సంబంధంలా మంత్రాలయం పీఠంకు శారధా పీఠంకు ఉంది. ఈ రోజు మా ఇద్దరి కలయిక చాలా ఆనందంగా ఉంది.

సనాతన హైందవ ధర్మాన్ని కోసం విశాఖ శారదా పీఠం ఏ విధంగా పోరాటం చేస్తూందో ఆ విధంగా మంత్రాలయం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకోపోతున్నారని  తెలిపారు. హైందవ ధర్మాన్ని విశ్వ వ్యాప్తంగా ప్రచారం చేయడమై మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి పీఠం, విశాఖ శారదా పీఠం లక్ష్యం అని అన్నారు.

Related posts

కంటైన్ మెంట్ జోన్ లో పర్యటించిన మంత్రి కేటీఆర్

Satyam NEWS

భ‌క్తుల పాలిట కొంగుబంగారం బెజ‌వాడ కనకదుర్గ‌మ్మ‌

Satyam NEWS

తెలంగాణ వాదనను ప్రపంచానికి చాటిన ప్రో. జయశంకర్

Satyam NEWS

Leave a Comment