29.7 C
Hyderabad
April 29, 2024 11: 02 AM
Slider హైదరాబాద్

తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో విశ్వకర్మ ఆరాధన

#viswakarma

తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో మేదర సంఘం భవనంలో దేవశిల్పి విశ్వకర్మ ఆరాధన పూజా కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు మురళీకృష్ణ మాట్లాడుతూ విశ్వకర్మ లేనిది విశ్వంబు లేదురా విశ్వదాభిరామ వినురవేమ ఆ రోజుల్లో వేమనగారు చెప్పినట్లుగా అటు దేవతలకు కూడా ఆ విశ్వకర్మ భగవానుడే వారి ఆయుధాలను చేశారని తెలిపారు. విశ్వకర్మ భగవానుడు ఇప్పుడు కలియుగంలో ప్రతి కులానికి కూడా పనిముట్లు అందచేశాడని తెలిపారు.

ప్రతి శుభకార్యం లో కూడా విశ్వకర్మ భగవానుడు ఉంటాడని ఆయన తెలిపారు. అటువంటి విశ్వకర్మ భగవానుని పూజ మన తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో చేయడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ లింగం గౌడ్, ప్రధాన కార్యదర్శి కత్తుల సుదర్శన్, ఉపాధ్యక్షులు లవంగాంజనేయులు, ఏనుగు నరేందర్ రావు, సంయుక్త కార్యదర్శి పోలోజు, వేణుగోపాలచారి, శ్రీరామదాసు, సంజీవ చారి, కే.శ్రీకాంత్ చారి, పులిమామిడి శ్రీహరి చారి, గొట్టాల వినోద్ కుమార్, ఏం.సంపత్ కుమార్, పి.సురేష్ చారి, వీచుక్కయ్యచారి, పి మురళి, జి.కుమార్, పి.రవీందర్, ఎం.సంపత్ కుమార్ చారి, ఆర్.శశికాంత్ చారి, దేవదాస్, నర్సింగ్ రావు విజయ్ పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

వివాదాల స్వామి ప్రబోధానంద కన్నుమూత

Satyam NEWS

ఘనంగా మాజీ భారత ప్రధాని పి.వి.నర్సింహారావు జయంతి

Bhavani

సంతృప్తికరంగా సాగుతున్న నాడు నేడు పనులు

Satyam NEWS

Leave a Comment