38.2 C
Hyderabad
April 29, 2024 11: 43 AM
Slider విశాఖపట్నం

సరుకు రవాణాలో విశాఖపట్నం పోర్టు సరికొత్త రికార్డు

#vizagport

విశాఖపట్నం పోర్టు ట్రస్టు పాత రికార్డులను తిరగరాస్తు సరుకు రవాణాలో శనివారం సరికొత్త రికార్డును నెలకొల్పింది. విశాఖపట్నం పోర్టు ఆవిర్భవించిన తర్వాత ఒక్క రోజులో అత్యధిక సరుకు రవాణా చేసిన ఘనతను 17-06- 2023న సాధించింది. 17-06-2023 న 4,01,875 మెట్రిక్ టన్నుల సరుకును 23 షిప్పుల నుంచి వివిధ బెర్త్ లు ద్వారా హ్యాండిల్ చేసి గతంలో ఒక్క రోజులో చేసిన అత్యధిక సరుకు రవాణా రికార్డును తిరగరాసింది.

ఇంతకు మునుపు  07-05-2023 న పోర్టులోని వివిధ బెర్త్ ల ద్వారా 27 షిప్ లో నుంచి చేసిన 3,78,760 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా ఇప్పటి వరకు ఒక్కరోజులో పోర్ట్ చేసిన అత్యధిక సరుకు రవాణా గా రికార్డులలో ఉంది. విశాఖపట్నం పోర్టు నూతన రికార్డులను సాధించటం పట్ల పోర్టు అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు  పోర్టు  ట్రాఫిక్ మేనేజర్ రత్న శేఖర్ మరియు  సిబ్బందిని ప్రశంసించారు.

పోర్టు సిబ్బంది కలిసికట్టుగా పనిచేయటం ద్వారా మరిన్ని కొత్త రికార్డులను తిరగ రాయవచ్చని పోర్టు చైర్మన్ ఈ సందర్భంగా ఉద్యోగులకు సూచించారు. పోర్టు ఈ ఘనతను సాధించడంలో కృషి చేసిన ట్రాఫిక్ విభాగం సిబ్బందిని డిప్యూటీ చైర్మన్ దుర్గేష్ కుమార్ దుబే , కార్యదర్శి టి. వేణుగోపాల్  లు ప్రశంసించారు.

Related posts

గులాబ్ తుపాన్: రెవిన్యూ సిబ్బందితో పాటు పోలీసులు కూడా అప్రమత్తం

Satyam NEWS

ఏపీ సీఎం జగన్ కేసుల విచారణ ఈ నెల 12కి వాయిదా

Satyam NEWS

కేటీఆర్‌ ట్వీట్:ప్రపంచస్థాయి ఆటగాడికి నా కన్నీటి వీడ్కోలు

Satyam NEWS

Leave a Comment