35.2 C
Hyderabad
May 1, 2024 01: 23 AM
Slider ఆదిలాబాద్

పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహణ

#volleyball tournament

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ఇప్పచెల్మా మారుమూల గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మైదానంలో పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలను నిర్మల్ జిల్లా ఇంఛార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఐపిఎస్ ఆదేశాల మేరకు ఈరోజు ముగింపు కార్యక్రమానికి నిర్మల్ డిఎస్పి ఉపేందర్ రెడ్డి హాజరైనారు.

ఈ సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ పాల్గొన్న క్రీడాకారులకు మొదటి బహుమతి ఇప్పచెల్మ గ్రామం గెలిచింది, బహుమతిగా 2000/-రూపాయలు. రెండవ బహుమతి బండ్రేరేవు తండా గ్రామము గెలిచింది, బహుమతిగా ₹1000/- అందుకున్నారు. మూడో బహుమతి పెండ్యాలదారి గ్రామ జట్లు గెలుచుకున్నాయి.

వారికి బహుమతిగా ట్రోఫీ అందచేశారు. ఈ సందర్బంగా డిఎస్పి మాట్లాడుతూ ఆటలో గెలుపు, ఓటమిలు  సహజం గెలిచిన జట్టుకు శుభాకాంక్షలు. ఆటలు ఆడడంతో శరీరానికి వ్యాయామం అవుతుంది, విద్యార్థులు, యువకులు చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉదయం వ్యాయామం చేయాలి ఆరోగ్యం కాపాడుకోవాలి.

ఓటమి చెందిన జట్లు బాధపడకుండా ఆటలో మంచి మెళుకువలు నేర్చుకొని మళ్లీ గెలిచే విధంగా ప్రయత్నించాలి. యువకులు ఇతర మార్గాల వైపు వెళ్లకుండా చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి  పోలీసు ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రులకు పేరు నిలబెట్టాలి కోరారు.

కరోనా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, వ్యాధిపై ప్రజలు భయాందోళనలు చెందకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు, భౌతిక దూరం, జాగ్రత్తలు పాటించేలా వారికీ అవగాహనా కల్పించారు.

ఈ కార్యక్రమలో  నిర్మల్ రూరల్ సీఐ వెంకటేష్, సారంగాపూర్ ఎస్ఐ రామ్ నరసింహ రెడ్డి, సర్పంచు శుంగన్న, గ్రామ పెద్ద నాగోరావు, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు మరియు గ్రామస్తులు 150 మంది వరకు హాజరైనారు.

Related posts

23 నుంచి హుజురాబాద్ లో రేవంత్ రెడ్డి ప్రచారం..

Satyam NEWS

రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారిని ఆదుకోవాలి

Satyam NEWS

చిత్తూరు జిల్లాలో ఒక్కరోజే ఐదుగురు యువతుల అదృశ్యం

Bhavani

Leave a Comment