26.7 C
Hyderabad
May 3, 2024 09: 52 AM
Slider నల్గొండ

క్వింటా ఒక్కింటికి 2500 రూపాయల మద్దతు ధర ఇవ్వాలి

#TDP Hujurnagar

తెలుగుదేశం పార్టీ సమావేశం శనివారం  పట్టణ అధ్యక్షుడు తండు సాయిరాం గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర టి ఎన్ టి యు సి అధ్యక్షుడు చావా సహదేవ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ సన్నరకం పంటలు వేయాలని చెప్పి వేయించిన రాష్ట్రప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతుందని అన్నారు.

అనావృష్టి కారణంగా  ఎకరాకు 20 బస్తాలు కూడా రావడం లేదని, యుద్ధ ప్రాతిపదికన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. పట్టణ టిడిపి మీ అధ్యక్షుడు సాయిరాం గౌడ్ మాట్లాడుతూ ఎల్ ఆర్ ఎస్ పేరుతో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను వేదనకు గురి చేస్తుందని అన్నారు.

వరి ధాన్యానికి క్వింటా ఒక్కంటికి 2500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ విశ్వనగరం చేస్తానని చివరికి దానిని నీటిలో ముంచారని, అది టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యానికి పరాకాష్ట అని అన్నారు. ఈ కార్యక్రమంలో లో మండల అధ్యక్షుడు రెక్కల శంభిరెడ్డి,

రైతు ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ రామజోగి, పట్టణం కార్యదర్శి ఆవుల పాటు శ్రీనివాస్, యలక వెంకటేశ్వర్లు గౌడ్, గార్లపాటి శ్రీనివాస నాయుడు, నలమాద శ్రీనివాస యాదవ్, ఇంటిమల్ల శ్రీను, షేక్ చిన్న సైదా, మేకల వెంకటేశ్వర్లు, కోటిరెడ్డి,

మీసాల సైదులు, మధు బాబు, వల్లపు దాసు కోటయ్య, ఉర్సు వెంకటేశ్వర్లు, గొట్టె రాము, ఐల వెంకన్న, వెంకీ, వేముల సీతారాములు, వెంకటరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

బిజెపి, టిఆర్ఎస్ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదు

Satyam NEWS

సంక్రాంతి లక్ష్మికి స్వాగతం

Satyam NEWS

రేపటి నుంచి ముంబయిలో రాత్రి వేళల్లో కర్ఫ్యూ

Satyam NEWS

Leave a Comment