31.7 C
Hyderabad
May 2, 2024 09: 59 AM
Slider సంపాదకీయం

కోర్టు అక్షింతల నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

#YSJaganmohanReddy

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముందుకు వెళుతుందా లేదా అనే సంశయం తలెత్తిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆసక్తి కలిగిస్తున్నది.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కొనసాగించేందుకు అఖిల పక్ష సమావేశంలో దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలూ ఆమోదం తెలిపిన నేపథ్యంలో అదే విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించడం లేదని ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం అందుకు హైకోర్టు ఇంటిరమ్ ఆదేశాలు జారీ చేయడం కూడా తెలిసిందే.

ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం సహకరిస్తుందా లేదా అనేది ప్రధాన ప్రశ్న. ఇప్పటికే ఎన్నికల సంఘ నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించడం ద్వారా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పిన అధికార వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత పలు సందర్భాలలో ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ ను తీవ్రాతి తీవ్రమైన పదజాలంతో విమర్శించింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ కుమార్ పై వ్యక్తిగత ఆరోపణలు చేయడం కొత్త కాదు కానీ ఇది ప్రభుత్వ వైఖరిని పరోక్షంగా వెల్లడించినట్లు అవుతుంది. దీనికి అనుగుణంగానే రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంటుందా లేక హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటుందా అనేది వేచి చూడాల్సిన అంశమే.

మంత్రి వర్గ ఎజెండాలో ఇది లేకపోయినా అనివార్యంగా మంత్రివర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయాన్ని చర్చిస్తారనడంలో సందేహం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధం గా ఉన్నట్లు హైకోర్టులో ఎన్నికల సంఘం అదనవు అఫిడవిట్ దాఖలు చేసింది.

గతంలో కంటే కరోనా కేసుల సంఖ్య తగ్గిందని ఎన్నికల సంఘం తన అఫిడవిట్ లో పేర్కొన్నది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని, తమకు భద్రత పెంచాలని ఎన్నికల కమిషన్ కోరింది.

కేబినెట్ భేటీ సందర్భంగా మందడంలో ఆంక్షలు

ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో సచివాలయంలో కేబినెట్  భేటీ కానుంది. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి మందడంలో ఉన్న మూడు రాజధానుల శిబిరం, అమరావతి రైతుల శిబిరం మీదుగా సీఎం జగన్ కాన్వాయ్ సచివాలయానికి వెళ్లనుంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రేపు శిబిరానికి రావొద్దంటూ అమరావతి రైతులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

మూడు రాజధానుల శిబిరానికి ఎవరినీ అనుమతించకపోతే.. తాము శిబిరానికి రామంటూ మందడం రైతులు పోలీసులకు తేల్చిచెప్పారు. మూడు రాజధానుల దీక్షకు అనుమతిచ్చి.. తమను రావొద్దని ఎలా అంటారని పోలీసులను రైతులు నిలదీశారు.

Related posts

ఎన్నికల సందర్భం…ఏపీలో భారీ గా ఏఎస్పీల బదిలీలు…!

Satyam NEWS

రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతున్నా స్పందించరా?

Bhavani

రాధిక మర్డర్:కట్నం వేస్టని కన్నతండ్రే కడతేర్చాడు

Satyam NEWS

Leave a Comment