ప్రపంచ ఆరోగ్య సంస్థ నాయకత్వంలో అంతర్జాతీయ వైద్యనిపుణుల బృందం సోమవారం రాత్రి చైనాకు చేరుకున్నది. ఈ బృందానికి డాక్టర్ బ్రూస్ ఐల్‌వార్డ్ నాయకత్వం వహించారని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అధనామ్ చెబ్రియెసస్ తెలిపారు. నమోదవుతున్న వైరస్ కేసులు స్థిరంగా ఉన్నాయని, ఇది మంచి పరిణామమని అయితే ఇప్పుడే ఒక అంచ నాకు రావడం సరైంది కాదని డబ్ల్యూహెచ్‌ఓ ఆరోగ్య ఎమర్జెన్సీ కార్యక్రమం అధ్యక్షుడు మైఖేల్ రేయన్ అన్నారు. ఈ బృందం నాలుగు రోజుల పాటు చైనాలో పర్యటిస్తుంది. చైనాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య తాజాగా 908కి చేరిందని జాతీయ ఆరోగ్య కమిషన్ తెలియజేసింది. దేశంలోని 31 రాష్ట్రాల్లో వైరస్ సోకిన వారి సంఖ్య 40,171గా నమోదైంది.
previous post