40.2 C
Hyderabad
May 1, 2024 18: 19 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో మూసిన కిరాణం షాపులపై ఫిర్యాదు చేసిన బిజెపి

#kiranashop

వనపర్తి పట్టణంలో చట్టాన్ని ఉల్లంఘించి కిరాణం దుకాణాలు బంద్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బిజెపి జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి ఏర్పుల జ్ఞానేశ్వర్ యాదవ్, పట్టణ బిజెపి అధ్యక్షుడు రాంమోహన్, బిజెవైఎమ్  అధ్యక్షుడు గజరాజుల తిరుమలేష్ కోరారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డికి, జిల్లా కలెక్టర్ కు,జిల్లా ఎస్పీకి, వనపర్తి టౌన్ ఎస్ఐ కి,ఎక్స్ సైజ్ ఇఎస్ కు, ఆబ్కారీ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేశామని వారు చెప్పారు. వనపర్తిలో బెల్లం లారీని పట్టుకుని కేసు నమోదు చేస్తే కిరాణం షాపులు బంద్ చేయాలని ఏ చట్టంలో ఉందని, రాజ్యాంగంలో ఉందా అని ప్రశ్నించారు. వర్తక సంఘం ద్వారా బెల్లం అమ్మకాలు చేయాలని చట్టంలో లేదని తెలిపారు. వనపర్తి పట్టణంలో ప్రతి చిన్న దుకాణం వారికి బయట ప్రాంతం నుండి బెల్లం తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని, వర్తక సంఘానికి బెల్లం అమ్మడానికి అనుమతి ఇవ్వరాదని వారు కోరారు. సంఘాలు వ్యాపారం చేయడానికి లేవన్నారు. బెల్లం అమ్మకాలు రేషన్ డీలర్లకు అప్పగించాలని వారు కోరారు. దుకాణాలు బంద్ చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్

Related posts

బంగ్లాదేశ్‌లో రెండు పడవలు ఢీ: 26మంది దుర్మరణం

Satyam NEWS

వాక్సినేషన్ వేసుకున్నా..మాస్క్ తప్పనిసరి…!

Satyam NEWS

నిరవధిక నిరాహార దీక్ష విరమించిన ఆర్టీసీ జేఏసీ నేతలు

Satyam NEWS

Leave a Comment