29.7 C
Hyderabad
April 29, 2024 09: 03 AM
Slider నల్గొండ

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను ఆదుకోవాలి

#roshapati

మున్సిపల్ కార్మికులు కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ఎన్నో త్యాగాలు చేశారని,వారిని తప్పక ఆదుకుంటామని భరోసా ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి  జీతాలు పెంచాలని, కనీస వేతనం24,000 రూపాయలు ఇవ్వాలని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద సి ఐ టి యు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేసిన అనంతరం కమిషనర్ కె.నరేష్ రెడ్డి కి వినతి పత్రం అందజేసిన పిదప రోషపతి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన జీవో నెంబర్ 60ని సవరించాలని,అంత వరకు జివొ లో ఉన్న విధంగా కేటగిరీల వారీగా పెరిగిన వేతనం జూన్ 2021 నుండి అమలు చేయాలని కోరారు.

కార్మికులకి ఒక సంవత్సరం నుంచి ఈ ఎస్ ఐ  కట్టడం లేదని,తక్షణమే సంవత్సరం బకాయి కట్టాలని,అర్హులైన కార్మికులందరికి డబుల్ బెడ్ రూమ్ సహకారం కల్పించాలని అన్నారు.కరోనాతో మరణించిన కార్మికుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని,వారి కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని అన్నారు.బిల్డింగ్ కార్మికులకు ఇచ్చిన విధంగా వెల్ఫేర్ బోర్డులో మున్సిపల్ కార్మికులకు కూడా కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో  సి ఐ టి యు జిల్లా కార్యవర్గ సభ్యుడు యలక సోమయ్య గౌడ్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష్య,కార్యదర్శులు కస్తాల ముత్తమ్మ,మేరిగ దుర్గారావు,సైదులు, క్రాంతి,వెంకటరమణ,కుమారి,చంద్రకళ, దేవ కరుణ,చంటి,కనకయ్య,పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఏపిలో జిల్లాల పెంపుపై తెలంగాణ అసెంబ్లీలో ప్రకటన

Satyam NEWS

హీటెక్కిన యూపీ ఎన్నికల ప్రచారం

Sub Editor

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నోముల భగత్

Satyam NEWS

Leave a Comment