39.2 C
Hyderabad
May 3, 2024 12: 48 PM
Slider మహబూబ్ నగర్

నాసిరకం పనులతో కుప్పకూలిన భగీరథ ట్యాంక్

#Mission Bhageeratha

నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల డిండి చింతపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మిషన్ భగీరథ లో భాగంగా నిర్మించిన వాటర్ ట్యాంకు కుప్పకూలిపోయింది. గుత్తేదారులు నాసిరకం పనులతో ఇష్టానుసారంగా వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టి కనీసం ప్రారంభానికి కూడా నోచుకోకుండా కుప్పకూలిపోయింది.

ఇంటింటికి త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టింది కోట్ల రూపాయలు ఖర్చు చేసి పథకాన్ని ప్రభుత్వం అమలు చేసిన ను అధికారుల నిర్లక్ష్యం గుత్తేదారుల నాసిరకం పనులతో ప్రజల తాగునీటి కష్టాలు తీరడం లేదనే చెప్పాలి.

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించాలి అనే చందంగా ప్రభుత్వం వరమిచ్చిన అధికారులు కాంట్రాక్టర్లు కాసుల కక్కుర్తితో సామాన్య మానవుని కష్టాలు తీరడం లేదు. అధికారుల చేతివాటం తో కాంట్రాక్టర్లు నిబంధనలను తుంగలో తొక్కి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నా నిర్లక్ష్యంగా చూసి చూడనట్లు వివరిస్తున్నారు.

పెను ప్రమాదం తప్పింది

శుక్రవారం రోజు వాటర్ ట్యాంకు ఒక వైపు ఒరిగి ఇటలీ నిర్మాణాన్ని తలపించింది. నిర్మాణం శనివారం కుప్పకూలి పోవడం తో గ్రామస్తులు నిరాశ చెందారు. ప్రస్తుత కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా అందరి పాలిట మృత్యువు కోరలు చాచిన డిండి చింతపల్లి గ్రామ ప్రజల పిల్లల పాలిట వరం అనే చెప్పాలి.

ప్రస్తుతం పాఠశాలలకు కరోనా సెలవులు ఉండటంతో పెను ప్రమాదమే తప్పింది. లేదంటే విద్యార్థులు ఆటలు ఆడే సమయంలో గాని అటు వైపు వెళ్లే సమయంలో కానీ వాటర్ ట్యాంక్ కుప్ప కూలిపోయి ఉంటే ఎన్ని చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేదో అని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వాటర్ ట్యాంక్ కూలిపోవడంతో గ్రామ ప్రజల త్రాగునీటి కష్టాలు తీరుతాయి అనే సంతోషం మూడునాళ్ళ ముచ్చట గానే మిగిలిపోయింది. అధికారుల పై కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటారా,లేదా అనేది వేచి చూడాల్సిందే.

Related posts

వైసీపీ నేత అంబటి కృష్ణ రెడ్డి కి గుండెపోటు

Bhavani

నూతన కార్మిక భవనం కార్మికులకు ఆధునిక దేవాలయం కావాలి

Satyam NEWS

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో షబ్బీర్ భేటీ

Satyam NEWS

Leave a Comment