38.2 C
Hyderabad
April 28, 2024 19: 53 PM
Slider ఖమ్మం

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం

#MP Nama Nageswara Rao

చీమలపాడు ఘటన పట్ల ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నామ మాట్లాడారు.ఈ ఘటన తనను ఇంతకాలం మాతో తిరిగిన పార్టీ కుటుంబ సభ్యులు మాకు ఆకస్మికంగా దూరం కావడం తీవ్రంగా బాధించిందన్నారు.పార్టీ కార్యకర్తలు మృతి చెందడం పట్ల తీవ్రంగా చింతిస్తున్నామని పేర్కొన్నారు.మా కళ్ళ ముందే ఈ ఘటన జరిగిందని తెలిపారు.ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కార్యకర్తలకు పార్టీ తరఫున రూ.10లక్షలు ,గాయపడిన వారికి రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు .అలాగే నామ ముత్తయ్య ట్రస్ట్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు , గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించ నున్నట్లు నామ వెల్ల డించారు .

ఘటనలో ఇద్దరు చనిపోగా ,నలుగురు గాయపడ్డారని ,మరొకరు పరిస్థితి సీరియస్ గా ఉందని తెలిపారు .ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లోనూ,ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాటు చేశామన్నారు. అవసరమైతే అత్యవసరంగా హైదరాబాద్ తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ విషయమై డాక్టర్లతో నిత్యం సమాలోచనలు జరుపు తున్నట్లు తెలిపారు .

ఘటన పట్ల చింతిస్తూ సంతాపసూచకంగా మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు నామ తెలిపారు .ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ సూచనల మేరకు కార్యకర్తలకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.మృతుల కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉండడడం తోపాటు వారి కుటుంబాలను జాగ్రత్తగా చూసుకుంటుందని నామ నాగేశ్వరరావు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ
ఘటన పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇన్ని రోజులు ఆత్మీయ సమ్మేళనాల్లో ఉత్సాహంగా, చురుగ్గా పాల్గొన్న కార్యకర్తలు కళ్ళముందు చనిపోవడం తమను ఎంతగానో బాధించిందన్నారు.

ప్రభుత్వ పరంగా మృతుల కుటుంబాలను అన్నివిధాల ఆదుకుంటామని ,వారికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. ఈ సంఘటనను జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు .జిల్లాలో మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు వెల్లడించారు.వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఈ ఘటన జరగడం చాలా బాధించిందన్నారు. ఇన్ని రోజులు కళ్ళ ముందు తిరిగిన కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకోవడం
బాధించిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండదండగా ఉంటుందని తెలిపారు . క్షతగాత్రులకు మెరుగైన, నాణ్యమైన చికిత్స అందిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటే శ్వరరావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం , కారేపల్లి మండల సీనియర్ నాయకులు ముత్యాల సత్యనారాయణ,కారేపల్లి సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, కారేపల్లి దేవస్థానం చైర్మన్ అడ్డగోడ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు .

చీమలపాడు ఘటన పట్ల ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నామ మాట్లాడారు.ఈ ఘటన తనను
ఎంతో బాధించిందని విచారం వ్యక్తం చేశారు.ఇంతకాలం మాతో తిరిగిన పార్టీ కుటుంబ సభ్యులు మాకు ఆకస్మికంగా దూరం కావడం తీవ్రంగా బాధించిందన్నారు.పార్టీ కార్యకర్తలు మృతి చెందడం పట్ల తీవ్రంగా చింతిస్తున్నామని పేర్కొన్నారు.మా కళ్ళ ముందే ఈ ఘటన జరిగిందని తెలిపారు.ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కార్యకర్తలకు పార్టీ తరఫున రూ.5లక్షలు ,గాయపడిన వారికి రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు .అలాగే నామ ముత్తయ్య ట్రస్ట్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు , గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించ నున్నట్లు నామ వెల్ల డించారు .ఘటనలో ఇద్దరు చనిపోగా ,నలుగురు గాయపడ్డారని ,మరొకరు పరిస్థితి సీరియస్ గా ఉందని తెలిపారు .ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లోనూ,ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాటు చేశామన్నారు. అవసరమైతే అత్యవసరంగా హైదరాబాద్ తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ విషయమై డాక్టర్లతో నిత్యం సమాలోచనలు జరుపు తున్నట్లు తెలిపారు .

ఘటన పట్ల చింతిస్తూ సంతాపసూచకంగా మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు నామ తెలిపారు .ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ సూచనల మేరకు కార్యకర్తలకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.మృతుల కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉండడడం తోపాటు వారి కుటుంబాలను జాగ్రత్తగా చూసుకుంటుందని నామ నాగేశ్వరరావు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ
ఘటన పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇన్ని రోజులు ఆత్మీయ సమ్మేళనాల్లో ఉత్సాహంగా, చురుగ్గా పాల్గొన్న కార్యకర్తలు కళ్ళముందు చనిపోవడం తమను ఎంతగానో బాధించిందన్నారు.
ప్రభుత్వ పరంగా మృతుల కుటుంబాలను అన్నివిధాల ఆదుకుంటామని ,వారికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. ఈ సంఘటనను జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు .జిల్లాలో మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు వెల్లడించారు.

వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఈ ఘటన జరగడం చాలా బాధించిందన్నారు. ఇన్ని రోజులు కళ్ళ ముందు తిరిగిన కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకోవడం
బాధించిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండదండగా ఉంటుందని తెలిపారు . క్షతగాత్రులకు మెరుగైన, నాణ్యమైన చికిత్స అందిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటే శ్వరరావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం , కారేపల్లి మండల సీనియర్ నాయకులు ముత్యాల సత్యనారాయణ,కారేపల్లి సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, కారేపల్లి దేవస్థానం చైర్మన్ అడ్డగోడ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు .

Related posts

ఉత్తరప్రదేశ్ సంఘటను ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

Satyam NEWS

నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వండి

Satyam NEWS

ఇగోహార్ట్:తనను గుర్తించని పోలీస్ పై మండిపడ్డ మంత్రి

Satyam NEWS

Leave a Comment