28.7 C
Hyderabad
April 28, 2024 04: 43 AM
Slider హైదరాబాద్

బిఆర్ఎస్ పార్టీకి.. కెసిఆర్ కే మా మద్దతు..

#support

తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెస్ నరహరి

తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతులను గుర్తించి 36 కులాలను ఓక్కే గొడుగు కిందికి తెచ్చి ఎంబీసీ  డెవలప్మెంట్ కార్పొరేషన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఏర్పాటు చేశారని తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెస్ నరహరి పేర్కొన్నారు. ఈ కులాలకు సబ్సిడీ పథకాలను ఎంబీసీ కార్పొరేషన్ నుండి నేరుగా అందే విధంగా చేశారని కొనియాడారు. ఎంబీసీ కులాల నిరుద్యోగ యువకులకు 36 ఈ ఆటోలు అందించారని తెలిపారు. అంతేకాకుండా సంచార ఎంబీసీ 36 కులాల వారికి మాహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించారని, బిసి బందు పథకం లో అవకాశం, ఉప్పల్ భగాయత్ లో  ఎంబిసి 36 కులాలకు 10 ఎకరాల స్థలం కేటాయిస్తూ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి 10 కోట్లు బడ్జెట్ కేటాయించారని పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలో భిక్షాటన కులాలైన మాకు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ ఏ రంగంలోనైనా నిర్లక్ష్యానికి గురయ్యామని, ఏ ప్రభుత్వాలు పాలకులు పట్టించుకోలేదన్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మమ్మల్ని గుర్తించి అభివృద్ధి చేయడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల తర్వాత కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడ్డాక  ఎంబీసీ 36 కులాల నుండి ఎంబీసీ వైస్ చైర్మన్ తో పాటు డైరెక్టర్లను నియమించాలని కోరారు. అలానే ఎంబిసి డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారానే బిసి బందు పథకం అమలు చేయాలని గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఎమ్మెస్ నరహరి పేర్కొన్నారు.

హైదరాబాద్,సత్యం న్యూస్

Related posts

శ్రీ శంభు లింగేశ్వర స్వామి ఆలయ గోపుర నిర్మాణానికి శంకుస్థాపన

Satyam NEWS

New Challenge: మంకీపాక్స్ అంటే?

Satyam NEWS

దాగుడుమూతలు: చెత్తను పోగు చేసి… పూలతో అలంకరించి….

Satyam NEWS

Leave a Comment