38.2 C
Hyderabad
April 29, 2024 11: 10 AM
Slider ప్రత్యేకం

కొల్లాపూర్ లో గడిచిన ఐదేళ్లలో  అన్ని అరాచకాలే

#kollapur

పోలీసుల సాయంతోనే అరాచకాలకు పాల్పడ్డ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గంలో గడిచిన ఐదేళ్లలో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి  కక్షపూరిత రాజకీయాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగల్ విండో డైరెక్టర్ పసుపుల నరసింహ, రంగినేని జగదీశ్వర్,రాము యాదవ్, శేఖర్ రెడ్డి, కౌన్సిలర్ జ్యోతి, శిరీష, సుజాత,మాజీ సర్పంచ్ బచ్చల కూర బాలరాజు పేర్కొన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో వారు  మాట్లాడారు.

ప్రస్తుత మంత్రి జూపల్లి కృష్ణారావు పై కక్ష పెంచుకున్న బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ అభివృద్ధిని అడ్డుకున్నారని వారు విమర్శించారు. 2018 ముందు కొల్లాపూర్ లో ఎప్పుడూ ఇంతటి దౌర్జన్యకర సంఘటలను జరగలేదని వారు చెప్పారు. గడిచిన ఐదేళ్లలో శాంతిభద్రతలకు బీరం హర్షవర్ధన్ రెడ్డి తీవ్రంగా ఆటంకం కలిగించారని చెప్పారు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని సొంత మాఫియాను ప్రోత్సహిస్తూ అక్రమాలకు పాల్పడిన ఆయన కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారని అన్నారు.

వాస్తవాలు వెలుగులోకి తెచ్చినందుకు దళిత జర్నలిస్ట్ అవుట రాజశేఖర్ పై ఎస్సై బాల వెంకటరమణతో అక్రమ కేసులు పెట్టించి  థర్డ్ డిగ్రీకి గురిచేసిన ఘనత  బీరం  హర్షవర్ధన్ రెడ్డికి దక్కిందన్నారు. మొల చింతలపల్లి సర్పంచ్ అక్రమ కేసులు అదేవిధంగా కౌన్సిలర్ రహీం పై రౌడీ షిట్,  విలేకరి రాజశేఖర్ సస్పెక్ట్ షిట్ ఓపెన్ చేపించింది కూడా బీరం హర్షవర్ధన్ రెడ్డి అని వారు వివరించారు.

అదేవిధంగా విలేకరి రాజశేఖర్ కు మద్దతు పలికినందుకు దళిత నాయకుడు  బచ్చలకూర బాలరాజుపై అక్రమ కేసులు పెట్టించింది కూడా బీరం హర్షవర్ధన్ రెడ్డేనని వారు తెలిపారు. ఎస్ఐలతో తెలంగాణ ఉద్యమ నాయకుల పైన కేసులు పెట్టించి జైలుకు  పంపించిరాన్నారు. అరాచకాలు సృష్టించి బాలరాజు అనే యువకుని కిడ్నాప్ చేసి దాడులు చేపించింది ఎవరని వారు ప్రశ్నించారు.

గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా పని చేసినప్పుడూ శాంతి భద్రతలతో కొల్లాపూర్ ను కంటికి రెప్పలాగా ప్రస్తుత మంత్రి జూపల్లి కృష్ణారావు కాపాడుకున్నారన్నారు. అలాంటి కొల్లాపూర్ ను సర్వ నాశనం చేసింది హర్షవర్ధన్ రెడ్డి అని వారు ఆరోపించారు. ఇకపై మంత్రి జూపల్లి పాలనలో కొల్లాపూర్ సస్యశ్యామలం కాబోతుందని, ప్రజలు స్వేచ్చ వాతావరణంలో ఊపిరిపిల్చుకోబోతున్నారని  చెప్పారు. కిరణ్ యాదవ్, వేణు యాదవ్,  పరశురాం నాయుడు తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Related posts

డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

సిఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం: శానంపూడి సైదిరెడ్డి

Satyam NEWS

ముత్యాల ముగ్గులు కళలలకు నిలయాలు

Satyam NEWS

Leave a Comment