40.2 C
Hyderabad
May 1, 2024 16: 03 PM
Slider నల్గొండ

గుడ్ వర్క్: నేతన్నలకు వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చేయూత

#Weavers Welfare

కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న వేళ, చేనేత కార్మికుల కష్టం చెప్పుకోలేనిదిగా ఉన్నదని, కుల వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న చేనేత కళాకారులు పని లేక పస్తులతో కాలం వెళ్లదీస్తున్నందున, తమ వంతు సహకారంగా చేనేత కార్మికులను ఆదుకోవాలని వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సభ్యులు నిర్ణయించారు.

 ఫోరమ్ లోని సభ్యులందరు తమ శక్తి మేరకు ఆర్ధిక సహకారం అందించారు. ట్రస్ట్ కోశాధికారి కందగట్ల స్వామి  పద్మశాలి విమెన్స్ ఫోరమ్ తరఫున వీవేర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సామాజిక విభాగం అధ్యక్షురాలు గుంటక రూప, సదాశివ్ అఖిలభారత పద్మశాలి యూవజన సంఘం అధ్యక్షుడు గుండేటి శ్రీధర్ యాదాద్రి భువనగిరి  జిల్లా చౌటుప్పల్ మండలం లోని చిన్నకొండూర్  గ్రామంలోని 40 చేనేత కుటుంబాలకు ఈ రోజు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తాం

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వృత్తి పై ఉన్న ప్రేమ, కుల వృత్తినే జీవనాధారంగా చేసుకున్న వారి పట్ల ఉన్న బాధ్యతతో వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్  ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు అందచేసినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు తమ ఫోరమ్ ఆధ్వర్యంలో చేస్తామని అన్నారు.

తమ వంతు సహకారంగా 40 కుటుంబాలకు 10 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో వంట నూనె,  సబ్బులు అందజేసినట్లు తెలిపారు. మునుగోడు పద్మశాలి యూవజన సంఘమ్ అధ్యక్షుడు దోర్నాల గజేందర్  మాట్లాడుతూ తమ విజ్ఞప్తిని మన్నించి తమ గ్రామంలోని చేనేత కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్  సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిన్నకొండూర్ పద్మశాలి సంఘమ్ అధ్యక్షుడు దోర్నాల అంజయ్య, సత్తయ్య, బిక్షపతి, సోమయ్య, జగన్నాధం, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, గడ్డం సత్యమూర్తి, నర్సింహా, రాముడు  సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

ప్రయివేటు టీచర్లను ఆదుకుంటున్న ప్రభుత్వ టీచర్లు

Satyam NEWS

లైట్ స్వీప్ బట్ ఓకే: సీట్లు తగ్గిన ఢిల్లీ అధికారం ఆప్ దే

Satyam NEWS

ఉనికి కోసమే టీడీపీ బస్సు యాత్ర…!

Satyam NEWS

Leave a Comment