38.2 C
Hyderabad
April 29, 2024 14: 49 PM
Slider నెల్లూరు

పౌర విమానయానంలో నైపుణ్యాభివృద్ధికి తీసుకున్న చర్యలు ఏమిటి?

#adalaprabhakarreddy

పౌర విమానయాన రంగంలో అందుబాటులో ఉన్న మానవ వనరుల నైపుణ్య అభివృద్ధికి సాంకేతిక శిక్షణ అందించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గురువారం సాయంత్రం లోక్ సభలో అడిగారు. దీనికి పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ రాతపూర్వకంగా సమాధానమిస్తూ విమానయాన రంగంలో ఉన్న అధిక డిమాండ్ కు అనుగుణంగా ప్రైవేటు రంగాన్ని సంప్రదించి నైపుణ్యాభివృద్ధి శిక్షణ, పరిశోధనల కోసం అనేక సాంకేతిక కోర్సులు రూపొందించాలని ప్రభుత్వం ఒక ప్రతిపాదనను ఆమోదించిందని తెలిపారు.

ఈ మేరకు అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లతో 2 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసినట్లు తెలిపారు. చండీగఢ్, ముంబైలలో మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు కోసం 1681 మంది అభ్యర్థులు చండీఘడ్ లో,720 మంది, ముంబైలో మూడేళ్ల వ్యవధిలో శిక్షణ పొందినట్లు తెలిపారు.

అదేవిధంగా నైపుణ్య అభివృద్ధి కోసం గుర్తించబడిన ఉద్యోగాలకు శిక్షణను ఇచ్చినట్లు పేర్కొన్నారు. విమానయాన వాటాదారుల ఉద్యోగుల కు శిక్షణను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్  అకాడమీని  1986లో అమేధి లో ఏర్పాటుచేసిన అతిపెద్ద ఫ్లయింగ్ శిక్షణ సంస్థలో ప్రవేశానికి జాతీయ స్థాయి పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది ఇప్పుడు డ్రోన్ కార్యకలాపాల్లో కూడా శిక్షణ అందిస్తోందని తెలిపారు.

Related posts

వ్యవసాయ రంగం బలోపేతానికి కేంద్రం చర్యలు

Bhavani

గండు శివ ను అభినందించిన సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్

Satyam NEWS

రిలాక్స్: రేపటి నుంచి చాలా ప్రాంతాలలో వెసులుబాటు

Satyam NEWS

Leave a Comment