38.2 C
Hyderabad
May 1, 2024 22: 18 PM
Slider ప్రపంచం

పాకిస్తాన్ లో తీవ్రమైన ఆహార సంక్షోభం

#foodscarcityinpakistan

పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా మారింది. దేశంలోని అనేక ప్రావిన్సులలో గోధుమ స్టాక్ అయిపోయింది దాంతో తీవ్రమైన ఆహార సంక్షోభం తలెత్తింది. ఆహారం కోసం తొక్కిసలాట జరిగినట్లు చాలా చోట్ల నుంచి వార్తలు వస్తున్నాయి. ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్‌లో వచ్చిన కథనం ప్రకారం ఈ గొడవలో హర్‌సింగ్ కొల్హి అనే 40 ఏళ్ల కూలీ రోడ్డుపై పడిపోవడంతో తొక్కిసలాటలో మరణించాడు.

ఇంతకుముందు సింధ్ ప్రభుత్వం ప్రజలకు సబ్సిడీ గోధమ పిండిని విక్రయిస్తున్నప్పుడు మిర్పుర్ఖాస్ తొక్కిసలాటలో ఒకరు మరణించారు. గోధుమ ధర క్వింటాల రూ. 5,000కి చేరుకోవడంతో, రావల్పిండి బహిరంగ మార్కెట్‌లో గోధుమ పిండి రేటు కిలో రూ.150కి చేరుకుంది. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని షహర్ నగరంలో 15 కిలోల గోధుమల బస్తాను రూ.2,250కి విక్రయిస్తున్నారు.

అదే సమయంలో, ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు సబ్సిడీ పిండి పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. 25 కిలోల ప్యాకెట్ సబ్సిడీ పిండి ధర రూ.3100కి చేరింది. విలేఖరుల సమావేశంలో బలూచిస్తాన్ ఆహార మంత్రి జమ్రాక్ అచక్జాయ్ మాట్లాడుతూ, గోధుమల నిల్వ అయిపోయిందని, తమకు రెండు లక్షల బస్తాలకు బదులుగా 10,000 బస్తాల గోధుమలు మాత్రమే వచ్చాయని అన్నారు.

ఆరు లక్షల బస్తాల కోసం పంజాబ్ ముఖ్యమంత్రి చౌదరి పర్వేజ్ ఎలాహిని అభ్యర్థించినట్లు చెప్పారు. గోధుమలు అందజేస్తామని ఎలాహి హామీ ఇచ్చారని తెలిపారు. అయితే, ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. గోధుమల విషయంలో పాకిస్థాన్ ఫెడరల్ ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు జమ్రాక్ అచక్జాయ్ తెలిపారు. పాకిస్థాన్ ప్రభుత్వం తనకు ఐదు లక్షల బస్తాల గోధుమలను అందించిందని, వాటిని గత నాలుగు నెలల్లో వినియోగించామని ఆయన వెల్లడించారు.

బలూచిస్థాన్‌ తన అవసరాల్లో 85 శాతం సింధ్‌, పంజాబ్‌లపై ఆధారపడి ఉందని అచక్‌జాయ్‌ చెప్పారు. స్థానిక మీడియా ప్రకారం, జనవరి 8 న, బలూచిస్తాన్ ముఖ్యమంత్రి మీర్ అబ్దుల్ ఖుద్దూస్ బిజెంజో, ప్రావిన్స్ ప్రజలకు గోధుమల కొరతను నియంత్రించే లక్ష్యంతో, గోధుమ నిల్వదారులు మరియు టోకు వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కానీ దాని ప్రభావం కనిపించడం లేదు.

మీర్ అబ్దుల్ ఖుద్దూస్ బిజెంజో మాట్లాడుతూ అన్ని జిల్లాల పాలనా యంత్రాంగాన్ని చైతన్యవంతం చేయాలని, గోధుమలను నిల్వ ఉంచి ఆహార పదార్థాలను అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.   

Related posts

అత్యాచారం చేసిన అధికార పార్టీ ఎమ్మెల్యే పి. ఏ పై చర్య తీసుకోవాలి

Satyam NEWS

రానున్న రెండు రోజుల్లో వడగాలులు మరింత తీవ్రతరం

Satyam NEWS

ధరల పెరుగుదలను నిరసిస్తూ నిరసన

Sub Editor 2

Leave a Comment