37.2 C
Hyderabad
April 30, 2024 13: 35 PM
Slider ప్రపంచం

బూస్టర్ డోస్‌ పై WHO కీలక ప్రకటన

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రోజు రోజుకు వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రపంచంలోని అనేక దేశాలు రక్షణ కోసం బూస్టర్ డోస్‌లను ప్రిఫర్ చేస్తున్నాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ బూస్టర్ డోస్‌ల ద్వారా విపత్తు నుంచి బయటపడలేరని హెచ్చరిస్తోంది.

ఏ దేశం కూడా మహమ్మారి నుంచి బయటపడలేదని వివరించే ప్రయత్నం చేసింది. ఇప్పటికే ఓమిక్రాన్‌ ప్రపంచంలోని 106 దేశాల్లో విస్తరించింది. అయితే కొన్ని సంపన్న దేశాలకు అదనపు కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లను పంపడం సమంజసం కాదని WHO వాదిస్తోంది.

ఇది అసమానతలను మరింత తీవ్రతరం చేస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోని చాలా పేద దేశాల్లో చాలా మంది బలహీన ప్రజలు ఇప్పటి వరకు ఒక్క డోస్‌ టీకాని కూడా పొందలేదు. అయితే సంపన్న దేశాలు మాత్రం పెద్ద ఎత్తున బూస్టర్ డోస్‌లంటూ హడావిడి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Related posts

అధునాతన ఫీచర్లతో ఐటీ శాఖ వెబ్సైట్

Satyam NEWS

ఏపిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

Satyam NEWS

ట్రాజెడీ: అదృశ్యమై అడవిలో శవంలా కనిపించిన సంజన

Satyam NEWS

Leave a Comment